Home » Tag » maldives
చైనాకు (China) 3 బిలియన డాలర్ల అప్పు ఉంది. దాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డ్రాగన్ కంట్రీ డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు బాధ్యతలు చేపట్టాక జనవరి నెలలో చైనాకి వెళ్లి వచ్చాడు. అధ్యక్షుడితో పాటు వివిధ నేతలను కలుసుకున్నాడు. ప్రస్తుత రుణాలను వాయిదా వేయడంతో పాటు మరింత సాయం చేయాలని రిక్వెస్ట్ చేశాడు. మయిజ్జుని అంతగా నమ్మని చైనా... ఆదుకుంటామని చెప్పి ముఖం చాటేసింది. పైగా తీసుకున్న అప్పులను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మొహమ్మద్ మయిజ్జు (Mohammad Maijju) బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనా అనుకూల నినాదంతో అధికారంలోకి రావడం... భారత్ సాయం అక్కర్లేదని తమ దేశంలో ఉన్న భారతీయ సైనికులు వెళ్ళిపోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు.
మాల్దీవ్స్‌కు వ్యతిరేకంగా, లక్షద్వీప్ దీవుల్ని తెరమీదకు తెచ్చారని అంతా భావించారు. అయితే.. మోదీ లక్ష్యం పర్యాటకం ఒక్కటే కాదు. అంతకుమించి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, మాల్దీవ్స్‌కు గుణపాఠం చెప్పడంతోపాటు మోదీ వేసిన ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
చింత చచ్చినా పులుపు చావలేదు అని మన సామెత మాల్దీవులకు సరిగ్గా సరిపోతోంది. భారత్ తో గొడవ పెట్టుకుంటే తమ టూరిజం పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినా... ఆ దేశాధ్యక్షుడు మయిజ్జు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో మాల్దీవుల జనంలో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. మన టూరిజం మీద ఆధారపడి రోజుకు 9 కోట్ల రూపాయల నష్టం వస్తోంది.
ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యద్వీప్ (Lakshadweep) పర్యటన తర్వాత.. బ్యాన్ మాల్దీవ్స్ ( Ban Maldives) హ్యాష్‌ట్యాగ్ (Hashtag) ట్రెండ్ అయింది. లక్ష్యద్వీప్ ప్రాముఖ్యత గురించి మోదీ వివరిస్తూ.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేయడం.. ఆ తర్వాత మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. జాత్యహంకార దాడులకు దిగుతూ.. మాల్దీవుల మంత్రులు కామెంట్ చేయడంతో మొదలైన రచ్చ.. ఆ తర్వాత అనుకోని మలుపులు తిరిగింది.
మాల్దీవ్స్, లక్షద్వీప్.. ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ రెండే హాట్ టాపిక్. ప్రధాని మోదీ లక్షద్వీప్ వెళ్లి ఆ ఫొటోలు ఇంటర్నెట్లో షేర్ చేయడంతో లక్షద్వీప్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మాల్దీవ్స్ మంత్రులు వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇండియన్స్‌ను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా మాల్దీవ్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. బైకాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్‌ను ఇంటర్నెట్లో ట్రెండ్ చేస్తున్నారు.
చాలా కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశీయ టూరిజం గురించి చెప్పారు. తాను తక్కువగా ట్రావెల్ చేస్తుంటానని, అయితే, ఒకవేళ అవకాశం ఉంటే ముందుగా ఇండియాలోని టూరిస్టు ప్లేసులకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు భారత్, మాల్దీవుల వైపే.. ఇటీవల భారత ప్రధాని భారత దేశపు.. లక్షదీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన కాస్త మాల్దీవుల దేశ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ప్రధాని పర్యటనను సిల్లిగా కోట్టిపారేస్తు.. మా దేశం మాల్దీవులకు మా దేశ లక్ష దీవులు లో పొంతనే లేదు అన్నట్టుగా లక్ష దీవుల పర్యటకు వ్యతిరేకంగా ఆరోపనలు, పోస్టులు పెడుతుంది మాల్దీవుల అధికారం పార్టీ ఎంపీలు, మంత్రులు.
భారతీయులతో పెట్టుకున్నందుకు మాల్దీవులకు మోత మామూలుగా మోగడం లేదు. ప్రధాని మోడీతో పాటు భారతీయులను అవమానిస్తూ ఆ దేశ మంత్రులు చేసిన కామెంట్స్ ....మాల్దీవులను కోలుకోలేని తీసింది. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లోని హోటళ్ళు బుకింగ్స్ రోజుకి వేలల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. రెండు రోజుల్లోనే మాల్దీవుల పర్యాటక రంగం లక్షల రూపాయలు నష్టపోయింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు, ఎంపీని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ తో భారత్ లో మొదలైన వ్యతిరేకత విదేశాలకు కూడా పాకుతోంది.
కొంతకాలంగా వీక్ అవుతూ వస్తున్న భారత్, మాల్దీవుల బంధం.. ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లడం.. అక్కడ ఆయన వ్యాఖ్యలపై.. మాల్దీవుల మంత్రి కౌంటర్ వేశారు. దీంతో కొత్త వివాదం మొదలైంది. అది కాస్త చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మాల్దీవుల మంత్రి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ నెటిజన్లు మారాయి. ఈ మధ్య ప్రధాని మోదీ.. లక్ష్యద్వీప్‌కు వెళ్లారు. అక్కడి పర్యాటక రంగాన్ని కొత్త జోష్ నింపేలా నాలుగు మాటాలు మాట్లాడారు. ముఖ్యంగా స్నార్కెలింగ్.. అంటే సముద్ర అడుగు భాగంలో ఈత కొట్టే సాహనం గురించి ప్రత్యేకంగ ప్రస్తావించారు.