Home » Tag » Malkaj Giri
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నిర్వహించిన రైల్ రోకో కేసులో ఆయన్ను A-15గా పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎందరు నేతలు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్థానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ వేవ్ ఉన్న టైంలో.. కేసీఆర్‌ను కొట్టేవాడు లేడు అని రాష్ట్రమంతా అనుకుంటున్న సమయంలో.. హుజురాబాద్ బైపోల్లో బీఆర్ఎస్ వేవ్‌ను ఢీకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటెల రాజేందర్.
తెలంగాణలో ఆరు గ్యారంటీలు... దేశవ్యాప్తంగా రాహుల్ న్యాయ్ గ్యారంటీలు... ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ కే ఓటెయాలని కోరుతున్నారు మల్కాజ్ గిరి (Malkaj Giri) కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి(Patnam Sunita Mahender Reddy).
మల్కాజ్ గిరి (Malkaj Giri) పార్లమెంట్ నియోజకవర్గంలో దేశంలో అతి పెద్దది. ఇక్కడ గెలుపును మూడు ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిస్థితి ఇప్పుడు మింగ లేక... కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్... లేకుంటే బీజేపీ... ఎక్కడికైనా మారాల్సిందే. బీఆర్ఎస్ లోనే ఉంటే... ఈ ఐదేళ్ళల్లో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని భయపడుతున్నారు.
ఈటల రాజేందర్ (Etala Rajender) కి బీజేపీలో కష్టాలు తప్పడం లేదు. ఆయనకు మల్కాజ్ గిరి ఎంపీ టిక్కెట్ ఇస్తారో లేదో ఇంకా తెలియదు కానీ ఆ నియోజకవర్గంలో అప్పుడే అసమ్మతి మొదలైంది. ఈటలని నిలబడితే మేం పనిచేయం... ఓడిస్తాం అంటూ మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గంలో బీజేపీ లీడర్లు మొండికేస్తున్నారు.
తెలంగాణలో మెస్ట్ డిమాండ్ ఉన్న మల్కాజ్ గిరి (Malkaj Giri) BJP ఎంపీ టిక్కెట్ ఈటల రాజేందర్ కు కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. బీజేపీ (BJP) హైకమాండ్ నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టు సమాచారం. అందుకే శామీర్ పేట (Sameer Peta) లోని తన నివాసంలో ఈటల రాజేందర్ సన్నిహితులతో మీటింగ్ పెట్టారని అంటున్నారు. మల్కాజ్ గిరిలో పోటీ చేయబోతున్నట్టు ఈటల తన అనుచరులకు కాల్ చేసి పిలిపించినట్టు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ అవుతాను... శాసనమండలిలో అడుగుపెట్టి అధ్యక్షా అంటా అనుకున్న నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) కు జాక్ పాట్ తగిలిందా... ఎమ్మెల్సీ కాదు... ఏకంగా ఎంపీ పోస్టే ఇవ్వాలని TPCC డిసైడ్ అయిందా...? పార్లమెంట్ (Parliament) కి వెళ్ళి... అక్కడ అధ్యక్షా అనే అవకాశం కల్పిస్తోందా... మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గానికి బండ్ల గణేష్ దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.
తెలంగాణ ఎన్నికల తర్వాత.. ఎవరి గురించైనా చర్చ భారీగా జరుగుతుంది అంటే.. అది కచ్చితంగా ఈటల గురించే ! ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులు.. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా నిలిచిన నేత.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో.. కొత్త చర్చ జరిగింది. దీనికితోడు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు.. ఈటలకు పొమ్మనలేక పొగపెడుతున్నాయా అనే అనుమానాలు వచ్చేలా చేశాయి
తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పరిచయం అవసరం వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం తరువాత బీఆర్ఎస్ మీద అదే స్థాయి పట్టు ఉన్న ఏకైక నేత ఈటెల రాజేందర్. కానీ అంతర్గత విభేదాల కారణంగానే అదే పార్టీకి ఆయన దూరమయ్యారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. హుజురాబాద్ బైపోల్లో బీజేపీ నుంచి పోటీ చేసి.. అప్పటి అధికార పక్షాన్ని కూడా పక్కకి నెట్టి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.