Home » Tag » malkajgiri
మొదటిసారి టీడీపీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు మొదటి జడ్పీ ఛైర్ పర్సన్‌గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
కమలాపూర్, హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల అక్కడేం చేశారు.. గెలిచిన తర్వాత సమస్య చెప్పుకోడానికి వచ్చే జనాన్ని కూడా కలవడు.. అలాంటోడికి మల్కాజ్‌గిరిలో ఎందుకు ఓట్లేయ్యాలని అడుగుతున్నారు సునీత.
కాంగ్రెస్‌ను.. సర్వే రూపంలో కొత్త గండం ఎదురవుతోంది. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ.. హస్తం పార్టీని పెడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి బై ఎలక్షన్ జరుగుతోంది.
సీఎం దెబ్బకు.. మల్లారెడ్డి చేతులెత్తేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కొడుకును బరిలో దించాలని ప్లాన్ చేసిన మల్లన్న.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు సందేశం పంపారు. ఈ నిర్ణయం వెనక.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీ బిల్డింగ్‌ల కూల్చివేతల ఎఫెక్ట్ భారీగానే కనిపిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్ ఉన్న మెదక్‌ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు మల్కాజ్గిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పరిశీలకులు.
రేవంత్.. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేద్దాం. సేఫ్ గేమ్ వద్దు. స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం. అక్కడ ఇక్కడ కాదు.
మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో గట్టిగానే టచ్‌లో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన మల్లారెడ్డి.. తన కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నానని సిగ్నల్స్ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ హుజురాబాద్ స్థానంతోపాటు, కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఏ పదవీ లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి మల్కాజ్గిరి బరిలో ఉంటారా అంటే దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది.
2008 డీలిమిటేషన్లో మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019లో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం ఈసారి ఎవరి పరమవుతుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది.