Home » Tag » Mallareddy
మాజీ మంత్రి మల్లా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ ఏరియాలో ఓ ల్యాండ్ వ్యవహారంలో తన అనుచరులతో వచ్చి గొడవకు దిగిన మల్లారెడ్డితో పాటు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి (Mallareddy), (మేడ్చల్), పల్లా రాజేశ్వరెడ్డి (Palla Rajeshwar Reddy), (జనగామ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య జరిగిన సంభాషణ కొత్త చర్చకు దారి తీస్తోంది. మేడ్చల్‌లోని KSR కన్వెన్షన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు మల్లారెడ్డి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా వచ్చారు.
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) పరిస్థితి ఇప్పుడు మింగ లేక... కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే కాంగ్రెస్... లేకుంటే బీజేపీ... ఎక్కడికైనా మారాల్సిందే. బీఆర్ఎస్ లోనే ఉంటే... ఈ ఐదేళ్ళల్లో తన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అని భయపడుతున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ కాలేజీలో కూల్చివేతలు జరగడం.. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుతో అల్లుడితో కలిసి మల్లన్న భేటీ కావడం.. ఎంపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం..
కూల్చివేత జరుగుతుండగానే పరుగు పరుగున అల్లుడితో కలిసి వెళ్లి.. ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఆ తర్వాత కేసీఆర్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అక్కడే అసలు ట్విస్ట్ కనిపించింది.
సీఎం దెబ్బకు.. మల్లారెడ్డి చేతులెత్తేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కొడుకును బరిలో దించాలని ప్లాన్ చేసిన మల్లన్న.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు సందేశం పంపారు. ఈ నిర్ణయం వెనక.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీ బిల్డింగ్‌ల కూల్చివేతల ఎఫెక్ట్ భారీగానే కనిపిస్తోంది.
మాజీ మంత్రి మల్లారెడ్డికి (Mallareddy) ఇప్పుడు సీఎం రేవంత్ (CM Revanth Reddy) పెట్టిన సెగ బాగా తగులుతోంది. ఆయన కాలేజీలకు వెళ్ళే రోడ్డు కోసం HMDA భూములను ఆక్రమించారంటూ మొన్ననే అధికారులు ఆ రోడ్డును తవ్వేశారు. ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన... దుండిగల్ లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో (Aeronautical Engineering College) అక్రమ కట్టడాలను కూల్చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో గట్టిగానే టచ్‌లో ఉన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన మల్లారెడ్డి.. తన కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నానని సిగ్నల్స్ ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
తమ భూములు మల్లారెడ్డి కబ్జా చేశారని.. ఆ మధ్య గిరిజనులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఘటనపై చర్చ జరుగుతుండగానే.. మల్లారెడ్డి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. తమ భూములు కబ్జాచేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన 6వందల మంది బాధితులు తరలి వచ్చారు.