Home » Tag » Mallikarjuna Kharge
తెలంగాణలో ఈనెల 5 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆషాఢం రాకముందే కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.
ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురెళ్లి పోరాడి... అక్రమ ఆస్తుల కేసులో జైలు కెళ్ళి.. దాదాపు 10యేళ్ళ పాటు రోడ్ల మీద తిరిగి.. రక రకాల వేషాలు వేసి, జనానికి ముద్దులు పెట్టి ఒళ్ళు నిమిరి, కులాన్ని ఉపయోగించి, తండ్రి బ్రాండ్ ఇమేజ్ ని వాడుకొని, ఆపై కోట్లు కుమ్మరించి, రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు. జగన్ కి అధికారం అంత ఈజీగా ఒడిలోకి వచ్చి వాలిపోలేదు. దాని వెనక పదేళ్లు కష్టం ఉంది.
తెలంగాణలో YSRTP కథ ముగిసింది. ఆ పార్టీని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఏపీ కాదు అండమాన్ బాధ్యతలు ఇచ్చిన స్వీకరిస్తా అంటున్నారు షర్మిల.
గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ ఇటీవల బాగా పుంజుకుంది. ప్రస్తుతం పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. అందుకే గెలుపు అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకునేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండబోయే కొన్ని కీలక హామీలివే.
ఇచ్చిన మాట తప్పకుండా, హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ. కానీ ఆ విషయం మరిచిపోయి రాహుల్, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
‘‘కరప్ట్ వర్కింగ్ కమిటీ” అని ఆ పోస్టర్లపై రాతలు. పోస్టర్లపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలను ప్రచురించారు. వారు కొన్ని స్కామ్ లు చేశారనే ఆరోపణలను కూడా ఆ పోస్టర్లపై ముద్రించడం గమనార్హం.
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, శ్రీ వర్ధన్ సహా ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
మొత్తం 26 పార్టీలు ఈ సమావేశానికి హాజరైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇండియా పేరులో అలయెన్స్ అనే పదం విషయంలో కమ్యూనిస్టులు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు మాత్రం దీనికి పూర్తి మద్దతు ప్రకటించాయి. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం ఉండకూడదని కొన్ని పార్టీలు సూచించడం వల్ల అలయెన్స్ అనే పదాన్ని చేర్చారు.
వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని.. రెండు దశాబ్దాల పాటు ముందుండి నడిపిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.