Home » Tag » Mallu Bhatti Vikramarka
వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే KTR JBSలో కూర్చోవాల్సి వస్తుందని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. CM వ్యాఖ్యలపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. CM తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సబిత డిమాండ్ చేస్తు.. మీడియా పాయింట్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు.
ఇప్పుడు తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో సభ దగ్గరకు భట్టి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు, ఆ వాహనం ఆపి డ్రైవర్‌పై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని తెలుస్తోంది.
ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించాం. దీని ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలిస్తాం. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నాం.
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టిక్కెట్ల కోసం 309 మంది ఆశావహులు అప్లయ్ చేశారు. ఈ లిస్ట్‌ను AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొచ్చారు రేవంత్, భట్టి విక్రమార్క.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అందుకోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్లో 18మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ప్రస్తుతం రేవంత్‌తో కలిపి 12 మంది ఉన్నారు.
ఆయనది లవ్ మ్యారేజ్ అవడమే ఒక షాకింగ్ అంటే.. ఆ కథలో ఉన్న ట్విస్ట్‌లు మరో షాక్‌లా.. సినిమా స్టోరీలను గుర్తు చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని లక్ష్మీపల్లిలో పుట్టిన భట్టి.. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ స్వేద పత్రం అంటూ రిలీజ్ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి, చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు ఆరో రోజు శాసనభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చించిన విషయం తెలిసిందే.
రేసులో ఎంతమంది ఉన్నా.. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో సీఎం పదవిపై రచ్చ తగ్గినట్లే అని అంతా అనుకున్నారు. ఐతే అది అంత ఈజీ కాదని.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతోంది.
ప్రజల సంపదను 10 సంవత్సరాలుగా పందికొక్కుల్లా తిన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రుణమాఫీ ఇవ్వదనడానికి కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి ఉండాలి. ఐదు సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేకి కేసీఆర్.