Home » Tag » Manda Krishna Madiga
మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజిన శాఖ, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులకు స్థానం కల్పించింది. వీలైనంత త్వరగా కమిటీని రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణలో BRS ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసిందన్నారు ప్రధాని. దళిత నేతను సీఎం చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ (KCR) సీఎం కుర్చీలో కూర్చున్నారని ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదన్నారు.
మందకృష్ణను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్నారు. ఆయన భుజం తట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. దాంతో మందకృష్ట మాదిగ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. మోడీ మందకృష్ణ వీపుపై తడుతూ ఓదార్చారు. సభలో మంద కృష్ణమాదిగ భావోద్వేగ ప్రసంగం చేశారు.