Home » Tag » Manipur Violence
మణిపూర్ అంశంపై చర్చించే అంశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వివాదం నడుస్తోంది. దీనికి తాజాగా ప్రతిపక్షాలు కొత్త మార్గాన్ని సూచించాయి. అయితే, ప్రతిపక్షాల ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తుందా.. లేదో చూడాలి.
మణిపూర్ హింసలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయి. అలాగే మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోవడం మరో ఎత్తు. అసలు వాళ్లంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలీదు
మణిపూర్ ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించింది. మణిపూర్‌లో కొన్ని నెలలుగా చోటు చేసుకున్న దారుణ ఘటనలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నెల 8 నుంచి 10 వరకు అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్, ప్రధాని ప్రకటన ఉంటాయి. మూడు రోజుల్ని అవిశ్వాస తీర్మానం కోసం స్పీకర్ కేటాయించారు. గత నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.
మణిపూర్‌లో జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా... ఇప్పటి వరకు సభలో మణిపూర్‌పై చర్చే జరగలేదు. కాలం గడిచే కొద్దీ.. అన్ని పార్టీలకు మణిపూర్ కూడా ఎన్నికల అంశంగా మారిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వాళ్లు కాపాడుకునే బిజీలో ఉంటారు. మణిపూర్ మాత్రం నగ్నంగా రోధిస్తూనే ఉంటుంది.
స్వాతంత్య్ర సమరయోధుడు ఎస్ చురాచాంద్ సింగ్ భార్య సోరోకైబామ్ ఇబెటోంబి అనే 80 ఏళ్ల వృద్ధ మహిళలను దుండగులు సజీవ దహనం చేశారు. మే 28 తెల్లవారుఝామున ఈ గ్రామంలో భారీ హింస చోటు చేసుకుంది.
మణిపూర్ హింసకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఉందనే వాదన వినిపిస్తోంది. మణిపూర్‌లో మొదట హింస చెలరేగిన చురాచాంద్పూర్కు, మయన్మార్‌లో డ్రగ్స్ అధికంగా ఉత్పత్తి అయ్యే చిన్ ప్రాంతానికి మధ్య దూరం 65 కిలోమీటర్లు మాత్రమే.
బేటీ బచావో.. బేటీ పడావో అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. ఆడ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత కోసం మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారేమోనని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మాకందరికీ అనిపిస్తుంది. బేటీ బచావో అని నినదించిన మీకు.. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు మాత్రమే నోరు ఎందుకు పెకిలింది?
కుకీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలను అత్యంత ఆటవీకంగా వారి బట్టలు విప్పతీసి, ఊరేగించడాన్ని బీజేపీ హార్డ్‌కోర్ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆ కమ్యూనిటికి చెందిన మహిళలకు అలానే అవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా పిచ్చి పోస్టులు పెడుతున్న వారిలో మహిళలు కూడా ఉండడం ఘోరం.