Home » Tag » Mansoons
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆవర్తనం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనిప్రభావంతో రాబోయే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయ్. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయ్. తెలంగాణలో మూడు రోజుల వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
వర్షాకాలం వచ్చిందన్న మాటే కానీ.. ఒకటో రెండో తప్ప.. గట్టి వాన పడింది లేదు తెలుగు రాష్ట్రాల్లో ! విత్తనాలు నాటిన రైతులు.. వరుణుడి కరుణ కోసం అమాయకంగా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి.
నైరుతి పలకరింపుతో.. ప్రకృతి పులకరిస్తోంది. నిన్నటివరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రాణాలు.. తొలకరి పలకరింపులతో సేద తీరుతున్నాయ్.
ఎండలు చుక్కలు చూపిస్తున్నాయ్. భానుడి భగభగలకు మాడు పగిలిపోతోంది. ప్రతీ డే.. ఫ్రై డేలానే మారిపోయింది సీన్. సూర్యుడు ఎండలతో మనుషులను ఫ్రై చేస్తున్నాడనిపిస్తోంది. ఉదయం 8 అవకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు భయపడి జనాలు బయట అడుగు పెట్టేందుకు కూడా ధైర్యం చేయడం లేదు.