Home » Tag » Marriages
చైనాలో జనాభా తగ్గడానికి కారణం నేటి యువత ఆలోచనలే. ఇప్పటి తరం పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక రిలేషన్లో ఇబ్బంది పడుతూ ఉండటం కంటే సోలోగా బతకడమే బెటర్ అనే నిర్ణయానికొచ్చింది నేటి యువత. అందులోనూ యువత సోలోగా బతకాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణాలున్నాయి.
వివాహ బంధం ద్వారా ఏకమవడం సులభమే.. కానీ అదే వివాహాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం అనుకున్న వెంటనే జరిగిపోదు. ఏ బంధమైనా విచ్ఛిన్నం కావాలని న్యాయస్థానాలు కూడా కోరుకోవు. అందుకే ఆలోచించుకోవడానికి భార్యాభర్తలు కొంత సమయం ఇస్తాయి. ఆ తర్వాతే అన్ని ఆంశాలను పరిశీలించి విడాకులు మంజూరు చేస్తాయి.
వివాహాలు చేసుకున్న వారు తమ వైవాహిక జీవితంలో సఖ్యత కుదరక స్వేచ్ఛ హరింపబడితే విడాకులు కోరవచ్చు. దీనికి సంబంధించి గతంలో నిర్ణీత గడువును నిర్ణయించింది దేశ అత్యున్నత న్యాయస్ధానం. కానీ నేడు ఆ గడువుకు తెరదించుతూ సంచలన తీర్పును వెల్లడించింది. దాంపత్య జీవితంలో పొసగలేని వారికి వెంటనే విడాకులు మంజూరు చేసే విశిష్ట అధికారం సుప్రీం కోర్టుకు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.