Home » Tag » MARS
మనం ఉన్న ఈ భూమి అనంత విశ్వంలో ఓ చిన్న అణువుతో సమానం. మనకు తెలియని రహస్యాలు అంతరిక్షంలో ఎన్నో దాక్కుని ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ రహస్యాలను ఛేదించడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
భూ గ్రహానికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి భూమికి ఒక కోడ్ వచ్చింది. దీన్ని ఏలియన్సే పంపించి ఉంటారని అంచనా. అంగారక గ్రహం నుంచి ఎన్కోడ్ చేసిన సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేజ్ గ్యాస్ ఆర్బిటార్ (టీజీఓ) గుర్తించి, భూమికి చేరవేసింది.
భూమి కాకుండా మరో నివాసయోగ్యమైన గ్రహం కోసం పరిశోధకులు ఎప్పటినుంచో వెతుకుతున్నారు. దీనిలో భాగంగా చంద్రుడు, అంగారక గ్రహాలు నివాసయోగ్యంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ గ్రహాలపైకి మనుషుల్ని పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది.