Home » Tag » Media
ఈ ప్రపంచంలో డబ్బు మహా చెడ్డది… అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రి కొడుకులను, తల్లి బిడ్డలను కూడా వేరు చేయగలిగే సామర్థ్యం ఒక డబ్బుకు మాత్రమే ఉంది. ఇప్పుడు మంచు కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు యుద్ధం ఎప్పుడో పురుడు పోసుకున్నా... ఇప్పుడు మాత్రం అతిపెద్దదిగా, అత్యంత పెద్దదిగా... మహా పెద్దదిగా కనపడుతుంది.
కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర రౌడీగా మారిపోయాడు. తన ఇంటికి వెళ్ళిన కన్న కొడుకు, అలాగే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడికి దిగాడు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీతారాం ఏచూరి మరణం.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఓ తీరని లోటు. ఆయన లాంటి బహుబాషా ప్రావీణ్యులు ఆ పార్టీకి దూరమవ్వడం దురదృష్టకరమని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు.
టీడీపీ తమ్ముళ్ళను ఎల్లో మీడియా మోసం చేస్తుందా...? సోషల్ మీడియాలో కథనాలనే తమ చానల్స్ లో ప్రసారం చేస్తూ మభ్య పెడుతున్నారా...? జరగని వాటిని జరిగాయని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటీ...? ఇప్పుడు ఈ ప్రశ్నలు టీడీపీ సర్కిల్స్ తో పాటుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నాయి.
ఏపీ రాజకీయాల్లో (AP Politics) ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎంట్రీలు త్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు మీడియా ముందుకు వచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడతారో ఎవరూ ఊహించలేకపోతున్నారు. రీసెంట్‌గానే ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి తండ్రికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. ఆయనకు 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబసభ్యులు. ట్రీట్మెంట్ తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు. తెలుగులో మొదటిసారి వార్తలు చదివిన న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కి గుర్తింపు ఉంది. 1983 నుంచి దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు.
మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి యూట్యూబ్ ఛానెళ్ళ దాకా అందర్నీ హెచ్చరించారు. కోర్టులకు లాగుతామని X లో ట్వీట్ చేశారు. ఆయన వార్నింగ్ ఇచ్చి ఒక్క రోజు కాకముందే.. 16 మీడియా సంస్థలకు నోటీసులు వెళ్ళాయి.
జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్, అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ ఇలా ఇద్దరికీ రాజమౌళితో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్లతో ఏర్పడిన పరిచయం తెలిసిందే. అంతేకాదు.. ఈ ఇద్దరినీ మహేశ్ బాబు సినిమా లాంచింగ్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడట రాజమౌళి.