Home » Tag » medical student preethi
ప్రీతి ఇష్యూలో తప్పు ఎవరిది.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులదా.. ర్యాగింగ్ కామన్ అని చేతులు దులుపుకున్న సిబ్బందిదా.. వాడెవడో బ్యాక్‌గ్రౌండ్ చూసి కనీసం పట్టించుకోని పోలీసులదా.. ఇంత జరుగుతున్నా పట్టించుకోని తోటి విద్యార్థులదా?
ఆకతాయి చేష్టలకు, అధికార బలుపుకు, ఆధిపత్య పోరుకు, అమాయకత్వ జీవనానికి, అత్యాచార ఘాతుకానికి ఇలా ఏదో ఒకదానికి ప్రతిసారి ఓ మహిళ బలి అవ్వల్సిందేనా. ఇంకా మనం ఎక్కడున్నామో.. ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆదిమానవుల కాలం నుంచి అత్యాధునికత యుగంవైపుకు పరుగులు తీస్తున్నప్పటికీ మొన్నటికి మొన్న దిశ, నేడు ప్రీతి అనే యువతులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం ఏమిటి. దీనికి అంతం ఉండదా..? ఏమి చేస్తే లోకం మారుతుందో చదివేద్దాం పదండి.
మూడు రోజుల పాటు నిమ్స్‌లో మృత్యువులో పోరాడిన ప్రీతి.. ఫిబ్రవరి 2న చనిపోయింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు అనేక వివాదాలకు తలెత్తాయి.