Home » Tag » Medigadda
రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వివరించింది. అయితే, సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇచ్చేలా ఢిల్లీలో సంతకం పెట్టి వచ్చారు. తెలివిలేక కాంగ్రెసోళ్లు సంతకం పెట్టి వచ్చారు. నాలోంటళ్లను అడిగితే ఏం చేయాలో చెప్తాం కదా. నాలుగైదురోజులు కాంగ్రెస్ మంత్రులు నాటకాలాడారు. అసెంబ్లీలో కూడా బడ్జెట్ పక్కకు పెట్టి ప్రాజెక్టులపై చర్చ పెట్టారు.
తెలంగాణలో కాళేశ్వర్యం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 3 వేల 200కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు. వారంలో రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు.
అధికార ప్రతిపక్షాలు అన్న తరువాత విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం కామన్. ఇవి కేవలం మాటల వరకు ఉంటే ఓకే. కానీ వీటికి ఆధారాలు కూడా తోడైతే రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే సీన్ కనిపిస్తోంది. కాళేశ్వరం విషయంలో ముందునుంచీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఒక్కటే. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. ప్రజాధనం అయ్యిందని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.