Home » Tag » Medigadda Barrage
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు.
తెలంగాణలో కాళేశ్వర్యం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 3 వేల 200కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు. వారంలో రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ బ్రిడ్జ్ కుంగడంతో.. నేషనల్ డ్యాం సేఫ్టి అధికారులు లోపాలను పరిశీలించేందుకు తెలంగాణకు వచ్చారు. పిల్లర్స్ కుంగడానికి అసలు కారణం చెప్తూనే తమ రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పారు.
కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది. మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్.. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల నుంచి రూ.1. 51 లక్షల కోట్లకు అంచనాలను పెంచాడు కేసీఆర్.
మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడంవెనుక ఉన్న కారణాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించి ఓ రిపోర్ట్ కూడా తయారు చేసింది. ఆ రిపోర్ట్‌లో బ్రిడ్జ్ కుంగడానికి గల కారణాలను క్లియర్‌గా ప్రస్తావించారు అధికారులు.
మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించేందుకు కేంద్ర బృదం తెలంగాణకు రాబోతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో సెంట్రలవ్ వాటర్ బోర్డుకు రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.