Home » Tag » Mega auction
ఐపీఎల్ అంటేనే సంచలనాలకు చిరునామా... ఈ సంచలనాలు కేవలం గ్రౌండ కే పరిమితం కాదు... ఆటగాళ్ళ వేలంలోనూ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికితే... మరికొందరికి షాక్ తగిలింది. కనీసం బేస్ ప్రైస్ కు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు బిడ్ వేయలేదు.
ఐపీఎల్ మెగావేలంలో రెండోరోజు పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఆచితూచి వ్యవహరించిన ఫ్రాంచైజీలు వెటరన్ ప్లేయర్స్ ను పట్టించుకోలేదు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆ దేశానికే చెందిన గ్లెన్ ఫిలిప్స్ అమ్ముడవలేదు.
ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లలో కొందరు బ్యూటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన అందంతో మెస్మరైజ్ చేయగా... పంజాబ్ కింగ్స్ ఓనర్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతాతో పాటు కోల్ కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా మెగావేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ సారి గేర్ మార్చింది. ఎప్పుడూ సీజన్ దగ్గరకొచ్చే సమయానికి షెడ్యూల్ ప్రకటించే అలవాటున్న బీసీసీఐ తొలిసారి ఐదు నెలల ముందే తేదీలు ఖరారు చేసింది.
ఐపీఎల్ వేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలుంది. అటు ఫ్రాంచైజీలు, ఇటు ఫ్యాన్స్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలోనూ వేలంలో చాలా ఆసక్తి ఉంటుంది. తాజాగా భారత్,ఆసీస్ టెస్ట్ మ్యాచ్ లో వేలం గురించి ఓ ఘటన చోటు చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందుకోసం ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. 1500 కు పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో 574 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు.
ఐపీఎల్ మెగావేలం కోసం ఇటు ఫ్రాంచైజీలు, అటు ప్లేయర్స్ తో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరివారంలో సౌదీ సిటీ జెడ్డా వేదికగా ఆక్షన్ జరగబోతోంది.
ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. రెండోసారి విదేశాల్లో నిర్వహిస్తున్న బీసీసీఐ ఈ సారి వేలం కోసం సౌదీ అరేబియన్ సిటీ జెడ్డాను ఎంపిక చేసింది. అటు రిటెన్షన్ జాబితాలను కూడా ఫ్రాంచైజీలు ప్రకటించేయడంతో పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వేలంలోకి వచ్చారు.
ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు ఈ సారి వ్యూహాత్మకంగా రెడీ అవుతున్నాయి. ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశాన్ని పక్కా ప్లానింగ్ తో వినియోగించుకుంటున్నాయి. అయితే అక్టోబర్ 31 సాయంత్రం వరకూ ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది మాత్రం తెలియడం లేదు.