Home » Tag » meta
కొత్త ఫీచర్ ద్వారా ఎవరైనా.. ఎవరికైనా డైరెక్ట్ మెసేజ్ (డీఎం) ద్వారా నగ్న చిత్రాలు పంపితే.. అవి ఆటోమేటిగ్గా బ్లర్ అవుతాయి. దీంతో ఇకపై న్యూడ్ ఫొటోలు పంపడం కుదరదు. ఈ ఫీచర్ ప్రధానంగా టీనేజర్లు లక్ష్యంగా రూపొందుతోంది.
ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ.. త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పెను ముప్పుగానే చూడాలి. అందుకే.. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా.
ఫేస్బుక్ రాకముందు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉండేవి. కానీ, వాటిలో ఫేస్బుక్ ఒక సంచలనం సృష్టించింది. మనిషికి, మనిషికి ఉండే దూరాన్ని తగ్గించింది ఫేస్బుక్. ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏ స్థాయిలో దూసుకెళ్లగలదో, కోట్లాదిమందిని ఎలా కనెక్ట్ చేయగలదో నిరూపించింది ఫేస్బుక్.
2024లోనూ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. టెక్ తో పాటు వివిధ కంపెనీల్లో గత రెండేళ్ళుగా కొనసాగుతున్న ఉద్యోగాల తొలగింపులు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రో సాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలతో పాటు స్విగ్గీ (Swiggy), ఫ్లిప్ కార్ట్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మెటా సంస్థకు ఏమైంది. ఒకవైపు లే ఆఫ్ ల పేరుతో ఉద్యోగుల తొలగింపు, మరో వైపు అకౌంట్లపై ఆంక్షలు, డబ్బులు వసూలు చేసే ఆలోచనలు.
వాట్సాప్ ఈ యాప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ యాప్ లేని స్మాట్ ఫోన్ అంటూ ఉండదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ని 2.2 బిలియన్లకు పైగా క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఒకరికొకరు మెసేజింగ్, ఫోటోస్, కాల్స్, వీడియో కాల్స్, డాక్యుమెంట్ పంపించుకోవడం, లొకేషన్‌ను షేర్ చేయడానికి వాట్స్ యాప్ వినియోగించుకుంటారు. కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్ ఉంది. తాజాగా ఈ యాప్ సరికొత్త ఫీచర్ తో అందుబాటులోకి వచ్చింది. దీనిపై ఒక లుక్ వేయండి.
వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదు ఈ కాలంలో ! ఆనందం అయినా.. బాధ అయినా.. ఏ ఎమోషన్ అయినా సరే.. అన్నింటికి అద్భుతమైన ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాల్డ్‌వైడ్‌గా 2వందల కోట్ల కంటే ఎక్కువ మంది ఈ యాప్‌ను వాడుతున్నారు. ఇందులో వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్‌కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారిని నేరుగా ఇక్కడా ఫాలో కావొచ్చు. కొత్తగా అకౌంట్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే.. ఇన్‌స్టా పేరుతోనే థ్రెడ్స్ యాప్ వాడుకోవచ్చు. అటు ఇన్స్టాగ్రామ్.. ఇటు ట్విట్టర్.. రెండింటి కలయికగా ఈ యాప్ ఉండొచ్చని అంచనా.
కొన్నేళ్లక్రితం ఏం చేస్తున్నావని ఎవర్ని పలకరించినా సాఫ్ట్వేర్ అని కాలర్ ఎగరేసుకుంటూ చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. పేరుకు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటూ ట్యాగ్ ఉన్నా.. చేస్తున్న ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో.. ఎప్పుడు పింక్ స్లిప్ చేతికొస్తుందో అర్థంకాని పరిస్థితి.