Home » Tag » Michoung Typhoon
అల్ల కల్లోలంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అర్ధరాత్రి కల్లా తీరానికి చేరుతుంది వాతావరణం వెల్లడించినా.. కాస్త ముందుగానే మిచౌంగ్ తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మిచౌంగ్ తుఫాన్ పూర్తిగా తీరాన్ని తాకేందుకు ఇంకా గంట సమయం పడుతుంది. కాగా మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని దాటే ప్రక్రియ మరో మూడు నుండి నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది.
తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తున్న భీకర వర్షాలు.. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దానికి కారణం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుఫాను.. డిసెంబర్ 5న ఈరోజు అర్థరాత్రికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది.
ఏపీ వైపుగా తుఫాన్ ముప్పు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పుదుచ్చేరికి 730 కిలోమీటర్లు, చెన్నైకి 740 కిలోమీటర్లు, నెల్లూరుకు 860 కిలోమీటర్లు, బాపట్లకు 930 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారానికి తుఫాన్‌గా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నా్. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని పేరు పెట్టారు.
ఇక సముద్ర తీరం వెంబడి.. 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశంముందని.. ఈ నెల 4న సాయంత్రానికి చెన్నై-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.