Home » Tag » Military
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా రక్షణరంగానికి ముప్పు వాటిల్లబోతుందా.. చైనా తన సాంకేతిక తంత్రంతో అమెరికాను అధిగమించే ప్రయత్నం చేస్తుందా.. వీటన్నిటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమనే సంకేతాలను ఇస్తుంది. అసలు చైనా.. అమెరికా రక్షణ రంగంలో ఎలా అడుగుపెట్టింది. దీనిని ఎలా నియంత్రిస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అసలు ఈ వాగ్నర్ గ్రూప్ ఏంటి? రష్యా సైన్యం ఉండగా ఈ ప్రైవేట్ సైన్యాన్ని పుతిన్ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ యెవ్జెనీ ప్రిగోజిన్ ఎవరు? రష్యాలో ఇంత పవర్ఫుల్ మ్యాన్‌గా ఎలా ఎదిగాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి.
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత నమ్మకస్తుడైన ప్రిగోరిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు సైన్యమే వాగ్నర్ గ్రూప్. దీన్ని తయారు చేసింది కూడా పుతినే. అయితే, తాజాగా ప్రిగోరిన్ తన వాగ్నర్ సైన్యంతో రష్యా సైన్యంపై తిరుగుబాటు ప్రకటించారు.
దేశాన్ని రక్షించాల్సిన సైన్యం దేశ ప్రజల ప్రాణాలు తీస్తోంది. విదేశీ చొరబాట్ల నుంచి రక్షించేందుకు దేశానికి కంచుకోటగా ఉండాల్సిన సైన్యం దేశాన్ని ముక్కలు చేస్తోంది. మిలిటరీ యూనిఫాంలో ఉండి ప్రజలతో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన సైనికుడు ఆ దేశ ప్రజల రక్తం కళ్ల చూస్తున్నాడు. ఇంతకు మించిన దాష్టీకం మరొకటి ఉంటుందా ? ఏ సైన్యమైతే తమను రక్షిస్తుందని ప్రజలు భరోసాతో ఉన్నారో అదే సైన్యం తుపాకీ గుళ్లను దించుతుంటే ఇక ఆదేశంలో బతికేదెలా ? మొన్నటికి మొన్న మియన్మార్... కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్.. తాజాగా సూడాన్.. మిలటరీ పాలకుల బరితెగించిన అధికార దాహానికి బలైపోతున్నాయి. సూడాన్‌లో రెండు మిలటరీ వర్గాల మధ్య చెలరేగిన అంతర్గత ఘర్షణ చివరకు భారతీయుడి సహా అనేక మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది.