Home » Tag » Miyazaki Mango
మామిడి ఈ పండు గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. అదే భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు.. పండు.. అందులోను మన దేశపు జాతీయ పండు కూడా ఈ మామిడి పండే. నిజానికి మనకు వేసవి అంటే ఎండల కన్న ముందుగా.. మామిడి పండే గుర్తుకు వస్తుంది. అందులోను పండ్లకు ఇది రారాజు గా పిలుస్తారు.
నార్మల్ మామిడిపళ్లతో పోలిస్తే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు 400 నుంచి 900 గ్రాములు ఉంటుంది. అంటే దాదాపు కిలో అన్నమాట. మిగిలిన మామిడిపళ్లలో కంటే ఈ మియాజాకి మామిడిపళ్లలో 15 శాతం షుగర్ ఎక్కువగా ఉంటుంది.
ఏపీలోని కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన రైతు ఓదూరు నాగేశ్వర రావు. ఆయన తనకున్న నాలుగు ఎకరాల్లో సాధారణ రకాలు కాకుండా.. అరుదైన ఎన్నో రకాల మామిడి చెట్లను పెంచాడు. వీటిలో అరుదైన మియాజాకీ మామిడి, నూర్జహాన్ మామిడి వంటి రకాలున్నాయి.