Home » Tag » MLA KAVITHA
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ప్రస్తుతం CBI కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత (MLA Kavitha). మొదటి రోజు ఆమెను సీబీఐ (CBI) ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. అప్రూవర్ల స్టేట్ మెంట్స్, కొన్ని ఎవిడెన్సులను చూపించి ఎంక్వైరీ చేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించి... తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. న్యాయమూర్తికి హ్యాండ్ రైటింగ్ లో రాసిన నాలుగు పేజీల లెటర్ లో తన బాధను వ్యక్తం చేశారు. తనను చిత్రవధ చేస్తున్నారనీ...తీహార్ జైలు నుంచి బయటకు పంపించాలని లెటర్లో వేడుకున్నారు కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi excise policy case)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత (kavitha) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నందుకు కేజ్రీవాల్‌ని.. బీఆర్ఎస్తో పొత్తు లేదని చెప్పడానికి కవితను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికి 7 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. ఢిల్లీ సీఎం ఏదో ఒక కారణంతో విచారణకు అటెండ్ అవ్వడం లేదు.
ఇప్పటికే కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గతంలో సమాచారం కోసం కవితను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది.