Home » Tag » MLA TICKETS
ఆరునూరైనా.. ఎంత దూరమైనా.. ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకోవాలని ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు టీడీపీ, జనసేన కలిసి అడుగులు వేయబోతున్న వేళ.. వైసీపీ నుంచి ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే.. ఎంత పెద్ద లీడర్ అయినా.. ఎంత దగ్గరివాడైనా.. తీసి పక్కనపెట్టేస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జిలను ప్రకటిస్తూ.. ఇప్పటికే రెండు జాబితాలు రిలీజ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల హడావుడి మాములుగా లేదు. 55మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఐతే రెండవ జాబితా వెంటనే విడుదల అవుతుందని అంతా భావించినా.. అది ఆలస్యం అవుతూ వస్తోంది. ఐతే ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న రెండో లిస్టును రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ తెలంగాణ పర్యటన వేళ.. 21న జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ కూడా సిట్టింగులకే ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మందికి ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని జగన్ చాలాకాలం నుంచి చెబుతూవస్తున్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో సీట్లు ఈసారి సిట్టింగులకే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా.. వారికి విజయం సాధించే సత్తా ఉన్నా.. వారి మధ్య జరిగే గొడవలే వాళ్ల ఓటమికి కారణాలు అవుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అలాంటి కాంగ్రెస్‌లో.. తెలంగాణకు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత కాస్త ఊపు వచ్చింది.
తెలంగాణలో బీఆర్ఎస్ విజయానికి కలిసి పనిచేయాలని అసంతృప్తులతో సాగిన భేటీ ఫలించినట్లేనా.. కేటీఆర్ స్పష్టమైన హామీతో అభ్యర్థుల మధ్య సఖ్యత కుదిరినట్లేనా.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, అసంతృప్తులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన పై అందరి దృష్టి సునీల్ పైనే ఉంది.
ఈసారి బీఆర్ఎస్ నుంచి ఒక్క టికెట్ కు కూడా నోచుకోని ఆ సామాజిక వర్గమే ‘ముదిరాజ్’ ! ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉండగా ముదిరాజ్ లకు పార్టీలో మంచి ప్రాధాన్యం లభించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుదీర్ఘ కసరత్తు తర్వాత తొలి విడతలో అసెంబ్లీ టికెట్స్ ఎవరెవరికి అనౌన్స్ చేయాలనేది డిసైడ్ చేశారని తెలుస్తోంది.
లోకల్ నాన్ లోకల్ అన్న మాటకు తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య ఈ మాటలే చిచ్చు పెట్టాయి . ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే లోకల్ నాన్ లోకల్ అంటూ పంచాయితీలు పెట్టుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం నీ పెత్తనం ఏంటి అన్న స్థాయిలో బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో ప్రత్యేక ఇంటర్వూ.