Home » Tag » MLAs
నాలుగో జాబితా ఎప్పుడు అన్న ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండక్కి ముందే క్లారిటీ ఇచ్చేస్తారా.. లేదంటే పండగ వెళ్లాక జాబితా బయటకు వస్తుందా అన్నదానిపై లీడర్లలో టెన్షన్ కనిపిస్తోంది. కొన్నిసీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కల కోసం వాటినీ ఆపాల్సి వచ్చిందంటున్నారు.
తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆహార్యంతో పాటు రాజకీయ వ్యవహారాల్లో కూడా డిఫరెంట్ స్టైల్ ఆయనది. మాస్ లీడర్ ఇమేజ్ ఉన్న జగ్గారెడ్డి.. సంగారెడ్డి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. చివరిగా 2018 ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ హవాను తట్టుకుని గెలిచిన ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన. కానీ.. 2023 వచ్చేసరికి ఫేట్ తిరగబడిపోయింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేలకు బంపరాఫర్ ఇచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలను ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో హామీల అమలుకు ఈ ప్రత్యేక నిధిని ఇస్తామన్నారు. నిధుల బాధ్యతలను ఇన్ ఛార్జ్ మంత్రులకు అప్పగిస్తారు. వారితో సమన్వయం చేసుకుంటూ.. ఆయా నియోజకవర్గాల్లో MLAలు అభివృద్ధి పనులు చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ.. వైసీపీలో నేతల అసంతృప్తి రకరకాలుగా బయటపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. సర్వేల పేరుతో ఇప్పటికే 60 మంది దాకా ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నడుస్తోంది. ఈలోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్తగా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.
వైసీపీలో ఈసారి 80 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. దాంతో ఎవరికి తాడేపల్లి ఆఫీసు నుంచి కాల్ వస్తుందో.. వాళ్ళకు టిక్కెట్ ఇవ్వనట్టే అన్న పుకార్లు నడుస్తున్నాయి.
తమకు ఇంచార్జిగా అవకాశం వస్తుందా.. రాదా.. అనే టెన్షన్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కూడా జగన్ పక్కనబెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇస్తుండటం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు.
వైనాట్ 175 అంటూ దూసుకుపోతున్న జగన్.. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను పక్కనపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ ఫలితాలను చూసి.. అది పక్కాగా ఫిక్స్ అయ్యారు. 2024 ఎన్నికల్లో సుమారు 50మంది సిట్టింగ్స్‌కు ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం కూడా కాలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇక ప్రొటెం స్పీకర్ విషయంలో లొల్లి చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే యుద్ధం చేస్తామని ముందే హెచ్చరించింది గులాబీ పార్టీ. కానీ కొంత టైమ్ ఇస్తుందని అనుకున్నా.. తొందరగానే ఎదురుదాడి ప్రారంభించింది.
గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16 వరకు మన ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకొన్నా. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహిస్తాం.