Home » Tag » MLA's List
ఎన్నికలకు ఇంకా మూడు నెలల టైం ఉన్నందున ఆలోపు దాదాపు 20 మంది అభ్యర్థుల్ని బీఆర్ఎస్ మార్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అభ్యర్థులపై ప్రజా వ్యతిరేకత ఉన్న రెండు డజన్ల స్థానాలపై కేసీఆర్ నిఘా ఉంచారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని, అందువల్ల కనీసం ముప్పై మంది సిట్టింగులకు ఛాన్స్ దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది. కొందరిపై ఇటీవలి కాలంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది కూడా. దీంతో వారిలో చాలా మందికి టిక్కెట్లు దక్కకపోవచ్చని ప్రచారం జరిగింది.
అభ్యర్థుల్ని ప్రకటించని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, వాటిని సరి చేసుకుని త్వరలోనే అభ్యర్థుల్ని వెల్లడిస్తామని కేసీఆర్ అన్నారు. వీటిలో గోషా మహల్, నాంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించకపోవడానికి ఎంఐఎం కారణమని విశ్లేషకులు అంటున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్ల రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకుగానూ 151 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ అభ్యర్థులు కేవలం 23 చోట్ల నెగ్గారు. వచ్చే పోల్స్‌లో కూడా అదే స్థాయిలో భారీ విజయాన్ని మూట కట్టుకోవాలని సీఎం జగన్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ రాజకీయం పీక్స్‌కు చేరింది. మూడు నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో.. కత్తులకు మించి పదును మీద కనిపిస్తున్నాయ్ రాజకీయ వ్యూహాలు. పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలుకావడంతో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ విజయంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయన ఎవరెవర్ని ఎక్కడెక్కడ నుంచి పోటీకి దింపాలనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటికి వచ్చారు. నియోజకవర్గాల వారీగా వివిధ సందర్భాల్లో సర్వేలు నిర్వహించిన కేసీఆర్ ఆ రిపోర్టు ఆధారంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు.