Home » Tag » MlC Quota Elections
మన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఘోరపరాభవం ఎదురైంది.
నాలుగు ఎమ్మెల్సీలు గెలిచినంత మాత్రాన.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా అంటే.. అవ్వొచ్చు.. అవకపోవచ్చు ! ఐతే ఒక్కటి మాత్రం నిజం.. ఈ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది. వైసీపీ ఇప్పటికైనా అప్రమత్తం కావాలి.. ఓటమిని, వైఫల్యాన్ని అంగీకరించకుండా.. ఇంకా మొండివాదన చేస్తామంటే.. 2024లో ఇంటికి వెళ్లాల్సిందే ! గుర్తులు ఉన్న ఎన్నికల్లో చూసుకుందాం అని ఒకరు అంటారు..
దేశ రాజకీయాలందు.. ఏపీ వేరయా అంటారు.. పాలిటిక్స్ తెలిసివాళ్లు అంతా ! నిజమే కూడా ! ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తుంటాయ్ అక్కడి పరిణామాలు. ఏపీ రాజకీయం రేంజ్ ఏంటో.. ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్పకనే చెప్పాయ్. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్న టీడీపీ.. బలం లేకున్నా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నెగ్గి.. వైసీపీ బలం మీద దెబ్బకొట్టింది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కన్ఫ్యూజన్లో పడింది. రెక్కలన్నీ తలో దిక్కు అన్నట్లుగా మారిపోయాయ్. వెన్నుపోటు పొడిచింది ఎవరు.. పొడవబోయేది ఎవరు అనే చర్చలో.. అసలు విషయం మర్చిపోతున్నారు వైసీపీ నేతలు !
వైసీపీకి వరుసగా రెండో షాక్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఝలక్‌తో వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. 23 ఓట్లతో గెలిచారు.