Home » Tag » MONEY
గడిచిన 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.4,658 కోట్ల విలువైన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే.. సగటున రోజుకు రూ.100 కోట్లకుపైగా సొమ్ము దొరికింది. అయితే, ఇది పూర్తిగా నగదు కాదు. ఇందులో నగదు డబ్బు రూ.395.39 కోట్లు మాత్రమే.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పూర్తవగానే.. డబ్బులు, మందు పంపిణీ స్టార్ట్ అయింది. ఈసారి ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లకు నోట్లలో తగ్గేదేలే అంటున్నారు. కొన్నిచోట్ల ప్రతి 100 మందికి ఒకరు చొప్పున తమ అనుచరులను పెట్టుకొని.. అభ్యర్థులు నోట్లు పంచుతున్నారు.
ఒకటి రెండు గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేయండి.. ఈజీగా మనీ సంపాదించవచ్చని టెంప్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వాళ్ల మాయలో పడిపోయి వాళ్లు చెప్పినట్టు చేస్తున్నారు. మొదట్లో వాళ్లు పంపిన లింక్స్ ను క్లిక్ చేయమనో, షేర్ చేయమనో చెప్తారు. అలా చేస్తే మన అకౌంట్లో నగదు జమ చేస్తారు. దీంతో చాలా మంది ఆశపడి అందులో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ.
గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కుబేరుల గురించి ఒక సర్వే చేసింది. దీని ప్రకారం ఏ దేశంలో ఎంత సంపద ఉంటే ధనవంతులుగా పరిగణించాలో లెక్కించింది. ఇండియాలో 1 శాతం మంది ధనవంతులు ఉన్నారని, వీళ్లందరినీ రిచీ రిచ్ క్లబ్బుగా పరిగణించాలని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది.
ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమాచారంతో ఐటీ శాఖ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టారు. పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఓ రాజకీయ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
కోయంబత్తూరులో రియల్ఎస్టేట్ బిజినెస్ చేసే రాజేశ్వరి, వర్షిణి ఫ్రెండ్స్. రీసెంట్గా ఓ ప్రాపర్టీ కోసం డబ్బు చెల్లించేందుకు పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో పెట్టింది రాజేశ్వరి. ఈ విషయం తెలుసుకున్న వర్షిణి ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలని ప్లాన్ చేసింది.
ప్రతిపక్ష టీడీపీకి, జనసేనకు సవాళ్లు విసురుతూ తన వ్యూహంలో చిక్కుకునేలా చేయడంలో జగన్ ముందుంటారు. ప్రతిపక్షాల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టీడీపీని ఓడించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది.
పక్క రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగసభలు పెడుతున్నావ్... ? మరి జనసమీకరణకు వాటికి అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తున్నావ్..? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావ్... మరి ఆ సొమ్ములెక్కడివి...? నీ బిడ్డ కూడా స్పెషల్ ఫ్లైట్లోనే ఢిల్లీ వెళ్లి వస్తోంది.. మరి దానికెవరు ఖర్చు చేస్తున్నారు..? ఇవి ప్రతిపక్షాలు మాత్రమే సంధిస్తున్న ప్రశ్నలు కాదు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు కూడా...!