Home » Tag » MOON
ఇవాళ రాత్రి 10 గంటలకు చంద్రున్ని చూస్తే జాతకం మారిపోతోంది. ఎంత దరిద్రంలో ఉన్నవాళ్లకైనా రాజయోగం పట్టేస్తుంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇది.
చంద్రయాన్-3 అధ్యాయం ఇక ముగిసినట్టే. విక్రమ్ నుంచి ఇక మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇది మేం చెప్తున్న మాట కాదు. స్వయంగా ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పిన మాట. చంద్రుడి సౌత్ పోల్లో 14 రోజులు పరిశోధనలు జరిపిన తరువాత విక్రమ్, ప్రగ్యాన్ను స్లీప్మోడ్లోకి పంపేశారు శాస్త్రవేత్తలు.
చంద్రుడిపై సమయాన్ని, మ్యాప్ ను కనుగొనేందుకు యూరోపియన్ దేశాలు ముందుకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు చంద్ర మండలం పై పనిచేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
భూకంపాలు భూమిపైనేనా.. చంద్రుడిపైన రావా అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో మోదీ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మీరు చేసిన ఈ కృషికి ఇవాళ యావత్ భారతం సలాం చేస్తుందన్నారు. 140 కోట్ల భారతీయులంతా మీరు సాధించిన విజయాన్ని చూసి గర్విస్తున్నారు.
ఇండియా నుంచి మూన్ మీదకు వెళ్లిన మొదటి ఇండియన్ రాకేస్ రోషన్ అట. అవును మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీమర్లకు దొరికిపోయారు దీదీ.
చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ తర్వాత.. ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందిస్తున్నాయి. ఐతే బ్రిటీష్ మీడియా మాత్రం తన బుద్ది ఏంటో చూపించింది. భారత్ మీద అక్కసు వెళ్లగక్కింది. ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చందమామపై చెరిగిపోని ముద్ర వేసింది చంద్రయాన్-3. ప్రగ్యాన్ రోవర్కు అమర్చిన ఆరు చక్రాల ఇస్రో లోగోతో పాటు భారత జాతీయ చిహ్నమైన మూడు సింహాలను కూడా ముద్రించారు సైంటిస్టులు. రోవర్ చంద్రుడిపై దిగగానే ఆ ముద్రలు చంద్రుడిపై పడ్డాయి.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ను వేరువేరుగా సందర్శించారు. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ను బుధవారం కలుసుకుని చంద్రయాన్-3 మిషన్ విజయవంతమవడంపై అభినందనలు తెలిపారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు మన "విక్రమ్" కాలు మోపుతాడని ఇస్రో ప్రకటించడంతో.. ఆ అపురూప క్షణం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.