Home » Tag » Moon Landing
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా నిలిచిపోయే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులకు చూపించబోతుంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఈ మేరకు ప్రత్యక్ష ప్రసారం చేయాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు చంద్రయాన్-3 ప్రయోగం షెడ్యూల్ ప్రకారమే విజయవంతంగా కొనసాగింది. బుధవారం జరగబోయే ల్యాండింగే అత్యంత కీలకమైన దశ. చంద్రయాన్-3ని చంద్రుడిపై దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. బుధవారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.