Home » Tag » MP
జూలై 18 న పుంగనూరు అల్లర్ల కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పై రెండు కేసులు నమోదు అయిన నేపధ్యంలో పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి ఎంపీ విచారణకు హాజరు అయ్యారు.
నరసాపురం మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సీఐడీ కేసులో చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడానికి యత్నించారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్ బంటులుగా పేరొందిన కొందరు పోలీసు అధికారుల పాత్ర ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.
గుంటూరు జిల్లా జైలు నుండి పిటి వారెంట్ పై నందిగాం సురేష్ ను మంగళగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. 2020లో జరిగిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరిపై మాజీమంత్రి రోజా ఘాటు కామెంట్స్ చేసారు.పురందరేశ్వరి బావ కళ్ళల్లో ఆనందం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా మరో యాగం చేశారు. రెండు రోజులపాటు చేసిన ఈ యాగం లక్ష్యం ఏమిటి అన్నదే అంతు పట్టడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు జైల్లో ఉండివచ్చాక నిర్వహించిన యాగాన్ని గతానికి భిన్నంగా ఎలాంటి హంగు లేకుండా ముగించారు.
పొలిమేర సినిమాతో ఫేమస్ ఐన దాసరి సాహితి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి సాహితీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. రాజేంద్రనగర్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ నామినేషన్ డాక్యుమెంట్స్ దాఖలు చేసింది.
మాధవీలతను గెలిపించేందుకు ఢిల్లీ నుంచి పెద్దలు దిగివస్తున్నారు. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసి.. ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ చుట్టేస్తున్న ఆమె.. నామినేషన్ దాఖలు చేశారు.
నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఈ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.
రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. సినీ హీరో వెంకటేష్‌కు రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డికి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చి పెళ్లి చేశారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ ఎవరికి వాళ్లు వాళ్ల మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఆఖరికి రామసహాయం రఘురాం రెడ్డిని టికెట్ వరించింది. భట్టి, తుమ్మల లాంటి సీనియర్ నాయకులు ఉన్నా ఆయనకే టికెట్ ఇచ్చారంటే ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనేది ప్రతీ ఒక్కరిలో ఆసక్తిగా మారింది.