Home » Tag » MPs
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకూ 13 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇంకా 4 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో వరంగల్ సీటు కడియం కావ్యకు ఇచ్చే అవకాశముంది. బీఆర్ఎస్ టిక్కెట్‌ను త్యాగం చేసి వచ్చిన కావ్యకు కాంగ్రెస్‌లో కన్ఫమ్ అయినట్టే అని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మార్పులు, చేర్పులతో కొంతమంది, అసలు అధికారంలేని పార్టీలో ఉంటే ఎంత... పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు. జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండటం కంటే... వేరే పార్టీ నుంచి స్వతంత్ర్యంగా బతకొచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ.. వైసీపీలో నేతల అసంతృప్తి రకరకాలుగా బయటపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. సర్వేల పేరుతో ఇప్పటికే 60 మంది దాకా ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నడుస్తోంది. ఈలోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్తగా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.
తమకు ఇంచార్జిగా అవకాశం వస్తుందా.. రాదా.. అనే టెన్షన్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కూడా జగన్ పక్కనబెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇస్తుండటం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు.
దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణలు వేగవంతం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ, విజయ్ హన్సారియా సహా పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
ప్రతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తును పోలిన గుర్తులు ఓట్లు గల్లంతు చేస్తున్నాయి. దీంతో ఈ సారి ఆ మిస్టేక్ జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్‌ను ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు కలిశారు.
రాజ్యసభలో అధికశాతం మంది బిలినియర్లే ఉన్నట్లు తెలుస్తుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారే అధికం వావడం విశేషం.
ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి.. ఎన్నికలైపోగానే.. వేరే పార్టీ వైపు చూసే వాళ్లను కట్టడి చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం అగ్రిమెంట్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.