Home » Tag » mumbai
ఐపీఎల్ మెగావేలంలో 574 మంది ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ అవగా... అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 12 మంది భారత ఆటగాళ్ళు, 208 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. అయితే మొత్తంగా 574 మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా దానిలో 204 మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లనున్నారు.
భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితోనే కాదు గత కొంతకాలంగా బ్యాట్ తోనూ అదరగొడుతున్నాడు. ఇప్పుడు ఫీల్డింగ్ లోనూ ఔరా అనిపిస్తున్నాడు. ముంబై టెస్టులో అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
ఐపీఎల్ రిటెన్షన్ హడావుడి ముగిసింది. కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నా... మరికొన్ని ఊహించినట్టుగానే రిటెన్షన్లు జరిగాయి. అయితే ఈ సారి రిటెన్షన్ కు సంబంధించి అత్యంత ఆసక్తి రేకెత్తించిన టీమ్ ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే..
ఐపీఎల్ మెగావేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. కొన్ని ఊహించిన రిటెన్షన్లు ఉంటే.. మరికొన్ని ఊహించని రిటెన్షన్లు కూడా కనిపించాయి. గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది.
భారత్, న్యూజిలాండ్ మూడో టెస్ట్ ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్ లో భారత్ ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. తొలి టెస్టులో ఓటమి తర్వాత రెండో టెస్టులో పుంజుకున్నట్టే కనిపించినా కివీస్ స్పిన్ కు చిక్కి పరాజయం పాలైంది.
ఐపీఎల్ మెగావేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ పైనా ఫోకస్ పెట్టాయి. గత సీజన్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ఫ్రాంచైజీలు సహాయక సిబ్బందిని కొత్తగా ఎంపిక చేసుకుంటున్నాయి.
ఐపీఎల్ మెగా వేలం వచ్చే నెలలో జరగనుండగా... ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు స్టార్ ప్లేయర్స్ ను కొన్ని ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేస్తుండగా... కొందరిని రిటైన్ చేసుకుంటున్నాయి.
ఐపీఎల్ మెగావేలం కోసం తమ రిటెన్షన్ జాబితాపై ఫ్రాంచైజీలు కసరత్తు కొనసాగుతోంది. ఈ సారి పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడం ఖాయమైంది. దీంతో ప్రతీ ఫ్రాంచైజీ రిటెన్షన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరిగిపోతోంది.
దేశవాళీ క్రికెట్ లో రంజీ ట్రోఫీ తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా పేరున్న ఇరానీ కప్ ను ముంబై కైవసం చేసుకుంది. దాదాపు 27 ఏళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో ముంబై విజేతగా నిలిచింది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రికార్డుల ఎవరెస్ట్... లెక్కలేనన్న రికార్డులు, టన్నుల కొద్దీ పరుగులు చేసిన భారత క్రికెట్ దిగ్గజం.. మరి తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు అడుగులు వేస్తున్నాడు.