Home » Tag » Muthireddy Yadagiri Reddy
ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా కార్పొరేషన్ చైర్మన్‌గా అయినా కొన్నేళ్లపాటు కొనసాగవచ్చని అనుకున్నారు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వాళ్ళే కాదు.. BRS సర్కార్ లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ ముందు ఇచ్చిన కార్పొరేషన్ పోస్టులను దక్కించుకున్న లీడర్లు కూడా పూర్తిగా కుదురుకోకముందే రిజైన్ చేయాల్సి వచ్చింది.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.
జనగామ, స్టేషన్ ఘన్పూర్ మాత్రం కేసీఆర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయ్. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఐతే అదే సమయంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా జనగామ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
నాలుగు స్థానాల్లో జనగామ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. కేసీఆర్‌కు ఆప్తుడు, బీఆర్ఎస్లో కీలక నేత అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు జనగామలో పరిశీలనకు రావడమే ఇందుకు కారణం. దీంతో జనగామ టికెట్ ఎవరికి అనే దానిపై జోరు చర్చ సాగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి చెందిన కీలక నేతలు సీక్రెట్‌గా పని కానిచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లాకు టికెట్ కేటాయించాలంటూ.. మద్దతుగా కొంతకాలంగా కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ రహస్యంగా సాగుతోంది.
సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని ఎమ్మెల్యు ముత్తిరెడ్డి కబ్జా చేసి తన కూతురు భవాని పేరు మీద రాశారు. ఈ భూమి దాదాపు 1,200 గజాలకుపైగా ఉంటుంది. ఈ భూమి మొత్తాన్ని తిరిగి చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తామని భవానీ ప్రకటించారు.