Home » Tag » Myanmar
ప్రతి ఏడాది మయన్మార్‌లో ఘనంగా నిర్వహించే బౌద్ధ పండుగ సందర్భంగా ప్రభుత్వం పలువురికి క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. దీనిలో భాగంగా అంగ్ సాన్ సూకీతోపాటు, దేశ మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌కు కూడా శిక్ష తగ్గించింది. క్షమాభిక్షలో భాగంగా ఆయనకు నాలుగేళ్ల శిక్షను తగ్గించింది.
అస్సాం రైఫిల్స్ సెక్టార్ 28 తెలిపిన వివరాల ప్రకారం.. ఆది, సోమ వారాల్లోనే 718 మంది మయన్మార్ వాసులు మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారు. ఖంపట్‌లో ఘర్షణల వల్ల వీరు రాష్ట్రంలోకి ప్రవేశించారని తెలిపింది.
మణిపూర్ హింసకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఉందనే వాదన వినిపిస్తోంది. మణిపూర్‌లో మొదట హింస చెలరేగిన చురాచాంద్పూర్కు, మయన్మార్‌లో డ్రగ్స్ అధికంగా ఉత్పత్తి అయ్యే చిన్ ప్రాంతానికి మధ్య దూరం 65 కిలోమీటర్లు మాత్రమే.
సైనిక విమానం ద్వారా వీరిపై బాంబుల వర్షం కురిపించింది. అందరూ ఒకే చోట ఉండటంతో భారీ నష్టం సంభవించింది. దీంతో దాదాపు వంద మందికిపైగా మరణించారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. తాజా దాడిని ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ తీవ్రంగా ఖండించారు.