Home » Tag » Mylavaram
వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఇటీవల కాస్త దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలపై గురిపెట్టింది. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంది. ఇదే వరుసలో టీడీపీపై అసంతృప్తిగా ఉన్న దేవినేనిపై దృష్టి పెట్టింది.
మైలవరంలో 2019లో ఉమాపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్.. ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. దీంతో ఉమాకు అక్కడ అవకాశం పోయింది. ఐతే పెనమలూరు టికెట్ అయినా వస్తుందని ఆశపడినా.. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కే ఇచ్చారు.
మైలవరంలో దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడంపై.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. వైసీపీ నుంచి వలస వచ్చి వసంత కృష్ణప్రసాద్‌కే మళ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దేవినేని ఉమాను ఎందుకు పక్కన పెట్టారు..? టికెట్ ఎందుకు ఇవ్వలేదు..?
ఉన్నదీ పోయింది.. కోరుకున్నదీ పోయింది.. చివరికి సంబంధం లేనిదేదో దక్కింది. మంత్రి జోగి రమేష్ మీద పడుతున్న పొలిటికల్ సెటైర్స్ (Political satires) ఇవి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో (Krishna District) ఏకైక మంత్రిగా ఉన్నారు జోగి రమేష్ (Jogi Ramesh). గత ఎన్నికల్లో పెడన నుంచి జోగి గెలవగా.. ఇప్పుడు అధిష్టానం అక్కడ నుంచి తప్పించింది. పెడనలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. తప్పించారనేది పార్టీ వర్గాల మాట.