Home » Tag » Mynampally Hanumanth Rao
ప్రతీసారి మనం గెలిచేందుకే కాదు.. ప్రత్యర్థి ఓడిపోయేందుకు కూడా వ్యూహాలు రచించారు. రెండు ఒకేలా అనిపిస్తున్నా.. వినిపిస్తున్నా.. ఇవి వేర్వేరు ! రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలే కనిపిస్తుంటాయ్.
మైనంపల్లి రాకతో కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది అన్న సంగతి ఎలా ఉన్నా.. మైనంపల్లిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కదుపుతున్న పావులు ఆసక్తికరంగా మారాయ్. మైనంపల్లికి దిమ్మ తిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో షాక్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. తనతో పాటూ కొడుకు టికెట్ పై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మైనంపల్లిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కానీ ఆయన రాజీనామాతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయ్యింది. మైనంపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి.
మైనంపల్లి పార్టీ హైకమాండ్‌పై.. ముఖ్యంగా మంత్రి హరీష్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు ఓ మహిళా ఎమ్మెల్యేకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు.
బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులను వదులుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మైనంపల్లి వ్యాఖ్యలపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తాము హరీష్‌కు అండగా ఉంటామని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు ప్రకటనలు చేశారు. ఇక అటు మైనంపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల్లోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మైనంపల్లి వ్యవహారం బీఆర్ఎస్లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సడెన్‌గా ఆయనకు కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ మాటల మీద బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అర్థం కాదు. నెక్ట్స్ ఏం జరుగుతుందన్న అంచనా లేదు.