Home » Tag » na samiranga
ప్రముఖ హీరో అల్లరి నరేష్ కి (Allari Naresh) తెలుగు ప్రేక్షకులకి మధ్య ఉన్న అనుబంధం రెండు దశాబ్దాల పై మాటే. 2002 లో వచ్చిన అల్లరి ఆయన మొదటి మూవీ.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీల్లో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర మూవీ కూడా ఒకటి. యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల తరహాలో చాలా కాలం తర్వాత మెగాస్టార్ నుంచి మళ్లీ అలాంటి సోషియో ఫాంటసీ మూవీ రాబోతోంది. ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో డైరెక్టర్ వశిష్ఠ .. ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
కింగ్ నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగా'.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్ మూవీ ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ మూవీ భారీ హైప్ తీసుకొచ్చారు మేకర్స్. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూసిన నాగార్జున ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ మూవీ అదరహో అంటున్నారు.
ఇద్దరి మధ్య పోటీ ఎందుకంటే, గుంటూరు కారం.. హనుమాన్ మూవీని తొక్కేస్తుందనే కోణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీద సానుభూతి ఉంది. హనుమాన్ లాంటి డివోషనల్ కంటెంట్‌కి నార్త్‌లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది కథ కాస్త క్వాలిటీ ఉన్న కాంతారా, కార్తికేయ 2 ఎలా కలెక్షన్స్ రాబట్టాయో చూశాం.
కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
సంక్రాంతి పోరులో ఈ సారి నాగ్ మూవీ నా సామి రంగని సైంధవ్ సినిమానే మించేలా ఉందంటున్నారు. కేవలం ట్రైలర్ పేలిందనే కోణంలోనే కాదు.. రెండు సార్లు గతంలో ఇలానే జరిగింది కాబట్టి ఈ సెంటిమెంట్ బలపడింది.
ఈసారి గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, ఈగిల్, హనుమాన్.. ఇలా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్, జనవరి 13న సైంధవ్, ఈగిల్, జనవరి 14న నా సామిరంగ విడుదల కాబోతున్నాయి. ఒకే సీజన్లో ఎక్కువ సినిమాలు ఉన్నప్పుడు డేట్స్ ఎడ్జస్ట్ చేసుకునేందుకు రిలీజ్‌లను కాస్త వెనక్కి ముందుకు జరపడం జరుగుతూ ఉంటుంది.
గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ వచ్చినప్పుడు ట్రోలింగ్స్ ఎంత జరిగినా, మహేశ్ డాన్స్‌తో వైబ్స్ మారాయి. ఇక ట్రైలర్ వస్తే ఇదేలా అంచనాలు పెంచుతుందో చెప్పలేం. విచిత్రం ఏంటంటే హనుమాన్ మూవీ తాలూకు కొత్త పాట గ్రాఫిక్స్ ప్రోమో కూడా మతిపోగొడుతోంది.
విచిత్రం ఏంటంటే ఈనెల 12, 13, 14 నే ఐదు సినిమాలు పోటీ పడే బదులు, రోజుకి రెండు కాకుండా ఒకటి చొప్పున వస్తే, థియేటర్ల సర్ధుబాటుకి ఛాన్స్ ఉంది. 11న అంటే గురువారం ఏదో ఒక మూవీ విడుదల ప్లాన్ చేసుకుంటే, థియేటర్ల సమస్య కనీసం ఓపెనింగ్స్ రోజైనా తీరుతుందనే అభిప్రాయం ఉంది.
సంక్రాంతి బరిలో ముందుగా ఏడెనిమిది సినిమాలు దిగాలనుకున్నా.. చివరికి 5 సినిమాలు మిగిలాయి. అయితే ఎవరూ రిలీజ్ డేట్ మార్చుకోము అంటున్నారు.