Home » Tag » Nagari
ఎన్నికల్లో ఓడిపోవటం ఏంటో గానీ వైసీపీ నేతల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఒకప్పుడు తమకు ఎదురే లేదు అన్నట్టు మాట్లాడిన చాలా మంది నేతలు ఇప్పుడు కనుమరుగైపోయారు.
ప్రజలు ఛీ కొట్టారు.. పార్టీ నేతలు ఒంటరిని చేశారు... సొంత అనుచరులు తమ దారి తమదే అన్నారు. ఈ సమయంలో ఫైర్ బ్రాండ్ రోజా దారెటు... చిత్తూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ళుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె... ఓటమి తరువాత కనిపించకుండా పోయింది.
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం కల్లా చాలా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది.
ఓ వైపు సొంత పార్టీలో అసంతృప్తులు.. మరోవైపు ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ప్రత్యర్థులు.. ఇలాంటి పరిణామాల మధ్య నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. మంత్రి రోజా.. నగరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏపీలో నగరి (Nagari) నియోజకవర్గంలో వైసీపీ (YCP) అభ్యర్థిగా ఉన్న మంత్రి రోజాకి ఈసారి ఓటమి తప్పదని అర్థమైంది. ఓటు వేసిన సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.
నగరిలో మంత్రి రోజాకు ఫాలోయింగ్ ఎంత తగ్గిపోయిందో.. మొన్నటి అసెంబ్లీ నామినేషన్ల కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. 2014, 2019లో కనిపించిన హడావిడి ఈసారి అస్సలు కనిపించలేదు. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధుల్లో కొందరు మాత్రమే హాజరయ్యారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ రాజకీయ, పర్యాటక మంత్రి, సాఃొ అధికారంలో ఉంటే మంత్రులు, రాజకీయ నేతల ఆస్తులు పెరుగుతాయా ? ఆ మాట లీడర్లను అడిగితే...అస్సలు ఒప్పుకోరు.
ఏపీలోని నగరి (Nagari) అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి రోజాపై (Minister Roja) వ్యతిరేక పీక్ స్టేజ్ కి చేరింది. ఐదు మండలాల వైసీపీ అధ్యక్షులు ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేశారు. మొన్నటిదాకా ఆమె సోదరుల ఆధిపత్యంపై తిరుగుబాటు చేస్తే... ఇప్పుడు రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి పెత్తనాన్ని సహించలేకపోతున్నారు.
ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది వైసీపీ (YCP)లో ! అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. జగన్ రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజకీయాన్ని వేడెక్కించడమే కాదు.. ఫ్యాన్ పార్టీ నేతలకు చెమట్లు పట్టిస్తున్నాయ్. నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. వైసీపీ నాయకులు నిద్రలేకుండా చేస్తున్నాయ్.
నాడు రోజాను గెలిపించడానికి పని చేసినవారే ఇప్పుడు ఆమె మీద తిరుగుబాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఒక అసమ్మతి నేత బలమైన ప్రత్యర్థిగా ఎదిగారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు.