Home » Tag » Nagarjuna Sagar
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) ను సందర్శించనున్నారు. జలాశయ పరిశీలనలో.. గంగమ్మకు చీరే సారే సమర్పించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు.
సాగు నీటి విషయంలో బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana) కు అన్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్.... అలయ్... బలయ్ చేసుకొని బిర్యాలు తిని... విందులు చేసుకొని ...ఆంధ్రాకు నీళ్ళను అప్పగించారని ఆరోపించారు ఉత్తమ్. రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చారని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ప్రస్తుతం డ్యాం ప్రాంతంలో ఏపీ, తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు 1500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైమ్.. ఇంకొన్ని గంటల్లో జనం పోలింగ్ కేంద్రాలకు చేరతారు. అర్థరాత్రి పూట నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేరుకున్నారు. డ్యామ్ లో సగం మాదే అంటే 13 గేట్లను ఆక్రమించుకొని కంచె నిర్మించారు. తెలంగాణ పోలీసులు వచ్చినా.. డ్యామ్ ఖాళీ చేయలేదు. ఆ తర్వాత 2 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా దిగువకు వదులుకున్నారు ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు.
రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత సాగర్ కుడికాలువ ద్వారా నీటిని ఏపీకి తిప్పుకున్నారు అక్కడి ఇంజినీరింగ్ అధికారులు. పోలింగ్ టైమ్ లో అకస్మాత్తుగా ఇప్పుడు నీళ్ళ పంచాయతీ ఎందుకు వచ్చింది..? తెలంగాణలో కేసీఆర్ ప్రోద్భలం ఉందా.. ఏపీలో జగన్ ఓట్ల కోసం రాజకీయం చేశారా..?
నీళ్లలో తమకూ వాటా ఉందని చెప్పిన ఏపీ అధికారులు.. డ్యాంకు సంబంధించిన 26 గేట్లలో 13 గేట్లను ఎత్తివేశారు. ఏపీకి నీళ్ల విడుదల చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. తెలంగాణ అధికారులు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.
తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? సాగర్ వివాదాన్ని వ్యూహాత్మకంగా సృష్టించారు. సాగర్ ప్రాజెక్టు ఎక్కడికి పోదు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టుతో పాటు దాని గేట్లు అక్కడే ఉంటాయి.
నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ స్పందించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు సీఎం కేసీఆర్ ఈ కుటిల ప్రయత్నంతో సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం జానారెడ్డి మౌనం వెనుక అసలు విషయం ఇదేనా..
బీఆర్ఎస్ నేత, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ టిక్కెట్ ఆశించారు. కొంతకాలంగా నియోజకవర్గంలో పని చేస్తున్న ఆయన టిక్కెట్ కోసం చివరిదాకా ప్రయత్నించారు. తనకు టిక్కెట్ ఇస్తే, అల్లు అర్జున్తో ప్రచారం చేయిస్తానని, ఎన్నికల్లో గెలుస్తానని అధిష్టానానికి తెలియజేశారు.