Home » Tag » Nandamuri Taraka Rama Rao
హైదరాబాద్ : సీనియర్ నటుడు(Balakrishna), ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 28 వ వర్థంతి సందర్భంగా ఈరోజు తెల్లవారు జమునా ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు.
హైదరాబాద్ లో ఎన్టీఆర్ సమాధి (NTR Ghat) సాక్షిగా నందమూరి కుటుంబంలో (Nandamuri family) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆర్డర్ వేశారు నటుడు బాలకృష్ణ. తీసెయ్.. ఇప్పుడే.. అని ఆదేశించాడో లేదో.. సిబ్బంది వెంటనే జూనియర్ ఫ్లెక్సీలు తీసి పక్కన పడేశారు.
ఏదైనా రంగంలో ప్రముఖులు లేదా ఏదైనా సంస్థలు, ఘటనలు, కట్టడాలు, వాటి అర్థ శతాబ్ది, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు.. ఇలాంటి వాటికి గుర్తుగా నాణేలను విడుదల చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. వీటినే స్మారక నాణేలు (కమెమోరేటివ్ కాయిన్స్) అని పిలుస్తారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.
ఈ రోజుల్లో నాయకులంతా ఓటు బ్యాంకు రాజకీయాలతో, అధికారం కోసం అడు గులేసే వాళ్లే తప్ప... జనం కోసం, జన క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్లు చాలా అరుదనే చెప్పుకోవాలి. తెలుగు నాట ఎన్టీఆర్ వేసిన బాటలో ఎందరో నాయకులు అన్ని పార్టీల్లో కనిపిస్తారు. ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఏ స్థాయిలో చక్రం తిప్పగలవో ఎన్టీఆర్ ఎప్పుడో నిరూపించారు.
తెలుగు జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు ఎన్టీఆర్. సినిమా నటుడిగా, ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు సాధించిన విజయాలు, అందించిన సేవల్ని తెలుగు ప్రజలెవరూ మర్చిపోలేరు. ఆ మహానుభావుడు జన్మించి ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి. అందుకే ఆయన శతజయంతి ఉత్సవాలను టీడీపీతోపాటు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.