Home » Tag » Nara Brahmani
నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు త్వరలోనే ఫుల్స్టాప్ పడనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే జరగనుందన్న వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 25 నుంచి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ కీలక నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.
తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ను ఏ14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబును.. లోకేష్‌ను.. పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు అచ్చెన్న, నారాయణ, దేవినేని ఉమ ఇలాంటి వారిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని ఊహించారు తప్ప.. భువనేశ్వరి.. బ్రాహ్మణిలను కూడా కేసుల పరిధిలోకి వచ్చేలా చేస్తారని ఊహించలేకపోయామనేది టీడీపీలో జరుగుతున్న చర్చ.
ప్రతీ క్షణం భువనేశ్వరికి ధైర్యం చెప్తూ తోడుగా ఉంటోంది బ్రాహ్మణి. కుటుంబ సభ్యులే కాదు.. పార్టీ నేతలు కూడా ధైర్యం కోల్పోకుండా వాళ్ల మధ్యే ఉంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబుతో జరిగిన ములాఖాత్‌లో బ్రాహ్మణికి చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
టీడీపీ ఆవిర్భవించాక.. కనివినీ ఎరుగని సంక్షోభం. పార్టీ అధ్యక్షుడు స్వయంగా జైలుకెళ్లారు. కోర్టులో కూడా ఎక్కడికక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కాకుండా.. మరిన్ని కేసులు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా కట్టడి చేసే దిశగా ప్రభుత్వం.. పెద్దలు అష్టదిగ్బంధనం చేశారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
త్వరలో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఆందోళన కలిగిస్తోంది. లోకేష్ కూడా అరెస్ట్ అయితే.. టీడీపీని ముందుకు నడిపించేది ఎవరు అనే విషయంలో నైరాశ్యం నెలకొంది. టీడీపీని కాపాడటం బాలకృష్ణ వల్ల కాదని ఇప్పటికే అనేక వార్తలు వస్తున్నాయ్.
మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణి.. వైసీపీ సర్కార్, జగన్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఈ అరెస్ట్‌ల పరంపర చంద్రబాబుతోనే ఆగే అవకాశాలు కనిపించడం లేదు.