Home » Tag » Narasapuram
పవన్ కల్యాణ్ తర్వాత.. రఘురామే ! ఈ ఎన్నికల్లో ఎవరి గురించైనా భారీగా చర్చ జరిగింది.. ఈ ఇద్దరి గురించే ! గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. జగన్కు ఎదురుతిరిగి, తిరుగుబాటు జెండా ఎగురవేసి.. చివరికి లాఠీదెబ్బలు తిన్న రఘురామ.. వైసీపీ మీద, జగన్ మీద కోపంతో రగిలిపోయారు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. చాలారోజుల సస్పెన్స్ తర్వాత సీటు సంపాదించి.. ఎమ్మెల్యేగా గెలిచారు.
ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి (Purandeshwari) ఈసారి మోడీ కేబినెట్ లో చోటు దక్కుతుందని అంతా ఆశించారు. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని కూడా టాక్ నడిచింది.
ఏపీ హాట్ సీట్లల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ రఘు రామకృష్ణ రాజు పోటీలో ఉండటమే ఇందుక్కారణం. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన RRR… అత్యంత నాటకీయ పరిస్థితుల్లో చివరి నిమిషంలో టీడీపీలో అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీగా నిలబడిన రాఘురామ... జగన్ పై నిత్యం తూటాలు పేలుస్తూ వార్తల్లో నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం... టార్చర్ పెట్టడం లాంటి సంఘటనలు జరిగాయి.
సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైంది. చిరంజీవి జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. సజ్జల నీకు నా సంగతి తెలీదు. చిరంజీవిని బెదిరిస్తున్నారు. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను.
అనపర్తి టికెట్ టీడీపీకి ఇస్తే దానికి బదులుగా తంబల్లపల్లి లేదా ఏలూరు లేదా రాజంపేట టికెట్ కావాలని బీజేపి డిమాండ్ చేస్తోంది. దీనికి టీడీపీ నుంచి కూడా సుముఖత వ్యక్తమైనట్టు సమాచారం. దీంతో అనపర్తి విషయంలో దాదాపు లైన్ క్లియర్ అయ్యింది.
రఘురామకు ఇప్పుడు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిన పరిస్థితి. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన అనుకున్నా.. పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి శ్రీనివాస వర్మను అభ్యర్థిగా అనౌన్స్ చేసింది కమలం పార్టీ.
కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి వెళ్ళగా.. అక్కడ RRRకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించింది. ఆ టిక్కెట్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల దగ్గర పైరవీ చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) గట్టి పోటీ ఇస్తాడనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం 21 సీట్లకే పరిమితం అయ్యారు. టీడీపీ (TDP), బీజేపీ (BJP) తో కూటమి కట్టినందుకు ఎక్కువ సీట్లు త్యాగాలు చేశారు. దాంతో జనసేనను నమ్ముకొని మొదటి నుంచీ పనిచేస్తున్న వారికి అన్యాయమే జరిగింది.