Home » Tag » narsing
నార్సింగ్ లో హరేకృష్ణ టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వేదికపై ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
అమ్మా..! నేను ఈ తప్పు చేస్తున్నందుకు నన్ను క్షమించు. ఇది తాజాగా శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ లేఖలోని మొదటి వాఖ్యం. అంటే ఇలా చేసుకోవడం అతనికి కూడా ఇష్టం లేదు. ఆ విద్యార్థికి ఎదురైన పరిస్థితులే అతనితో ఇలా చేయించాయి అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకూ ఇంతటి తీవ్ర డిప్రెషన్ కి లోనవ్వడానికి కారణం ఏమిటో తెలుసా..? యాజమాన్యం చదవండి, చదవండి అని పెట్టిన టార్చర్. చదువు ముఖ్యమే.. అయితే ప్రాణాలు తీసుకునే చదువు అవసరం అంటారా. పేరెంట్స్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లవాడి బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ కలలను వారిపై రుద్దకండి.
విద్యయా లభతే జ్ఞానం అంటారు. ఇక్కడ కొంచెం ఈ వాఖ్యాన్ని మార్చి విద్యయా మృత్యు పయనం అని రాయవల్సి వస్తుంది. ఇలా అనడానికి బలమైన కారణం ఉంది. ఒకప్పుడు చదువుకునే స్థాయి నుంచి చదువును కొనే స్థాయికి కార్పోరేట్ శక్తులు మార్చేశాయి. అందులో ప్రధమంగా నారాయణ, శ్రీచైతన్య. నారాయణలో చేర్పిస్తే మంచి ర్యాంకు ఖాయం అనేలా తల్లిదండ్రుల్లో అపోహను సృష్టించేశారు. అలా ఆశపడి చేర్పించామా పిల్లవాడిపై నారాయణ మంత్రం జపించేయాల్సిందే. అంటే జ్ఞానం ఇవ్వాల్సింది అటుంచి ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారు. గత రెండు దశాబ్థాల నుంచి తాజాగా నార్సింగ్ శ్రీచైతన్య కళాశాలలో చనిపోయిన సాత్విక్ వరకూ ప్రతిఒక్కరి చావు వెనక ఒక దీన కథ ఉంటుంది. ఆ కథ వెనుక ఈ కార్పోరేట్ కాలేజీల హస్తం తప్పకుండా ఉంది.