Home » Tag » Natural disaster
వాయనాడ్ (Wayanad) లో ప్రకృతి (Natural Disaster) సృష్టించిన విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలలో కూడా ఊహించని విధంగా, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి విపత్తు చూడటం కంటే చావడం మేలు అన్నట్టుగా విరుచుకుపడ్డాయి వరదలు, కొండచరియలు.
ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ (Kerala) లో ఇప్పుడు అదే ప్రకృతి విపత్తుతో (Natural disaster) మరణ మృదంగం మోగుతోంది. దేశం మొత్తం కేరళ ఈ విపత్తు నుంచి బయటకు రావాలని ప్రార్ధిస్తోంది. కేరళ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా వేగంగా చర్యలు చేపడుతూ బాధితులకు సహాయం చేస్తూ, బురదలో, రాళ్ళ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు.
కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనతో కేరళ రాష్ట్రం (Kerala State) విలవిలలాడిపోతోంది. రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇథియోపియాలో ఆదివారం భారీ వర్షంలో కొండచరియలు విరిగిపడ్డాయి విషయం తెలిసిందే.. ఈ ఘటనలో రెండు రోజుల వ్యవధిలో దాదాపు 229 మంది దుర్మరణం పాలయ్యారు.
టర్కీ దేశంలోని దేశ రాజధాని ఇస్తాంబుల్ వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైనట్లు తెలుస్తోంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది.
తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం 7.14 గంటలకు హింగోలి ప్రాంతంలో ఉదయం భూమి కంపించింది.
రెమాల్ తుపాను కారణంగా మణిపూర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించి అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
భారత్ పొరుగు దేశం అయిన చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో చోటు చేసుకుంది.
జపాన్ (Japan) దేశాన్ని మరోసారి భూకంపం కుదిపేసింది. టెక్నాలజీలో అందరికన్నా ముందున్న జపాన్ దేశంలో భూకంపాలు (Earthquake) రావడం అనేది సర్వ సాధారణం.. కాగా నేడు ఉదయం నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు(EARTH QUAKE) సంభవించాయి.
ఇండోనేషియా (Indonesia) లోని దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలో మూడు నదులు నగరలను ముంచెత్తాయి.