Home » Tag » NCP
బిజెపి శాసన సభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పది రోజుల సస్పెన్స్ తర్వాత సీఎం ఎంపిక కొలిక్కి వచ్చింది. ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ, శివసేన, బీజేపి... సీఎం పీఠం విషయంలో పట్టుబట్టాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మహాయుతి కూటమి ఓ అంగీకారానికి వచ్చింది. అర్థరాత్రి వరకు అమిత్ షా నివాసంలో జరిగిన మహాయుతి నేతల సమావేశంలో మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాజకీయ చాణుక్యుడు.... 50ఏళ్ల పాటు మరాఠా రాజకీయాల్ని కనుసైగలతో శాసించిన కురువృద్ధుడు... అధికారాన్ని తన ఇంట్లో కట్టేసుకున్న శక్తిమంతుడు... కానీ పొలిటికల్ మారథాన్ చివరి మెట్టుపై బోల్తాపడి రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఆయనే శరద్ పవార్..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేసారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో షిండే, ఆయన డిప్యూటీలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో కలిసి గవర్నర్‌ను కలిసారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంవీఏకి ఊహించని షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్, శివసేన యుబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. దీంతో మూడు పార్టీ భవిష్యత్ గందరగోళంలో పడింది.
ఆదివాసీ కోటలో జేఎంఎం కూటమికి విజయానికి కారణాలు ఏంటి ? కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా...నామమాత్రపు పాత్రేనా ? ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయడమే...బీజేపీ కొంపముంచిందా ?
మహారాష్ట్ర రాజకీయాలను బిట్ కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6వేల 6వందల కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్లో ఉన్నదెవరు...? శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే పేరెందుకు వచ్చింది...?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు (National General Elections) ముగిశాయి. వరుసగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ (Narendra Modi) మూడోసారి కూడీ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో ఓటమితో BRS పార్టీ బేస్ కోల్పోయింది. బేస్మెంట్ సరిగా లేకపోతే... ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏం లాభం అనుకున్నారో ఏమో... ఒక్కో రాష్ట్రంలో గులాబీల దుకాణాలను కట్టేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఇప్పటికే ఒడిశాలో BRS నేతలు కాంగ్రెస్ (Congress) లో చేరిపోవడంతో... అక్కడ పార్టీ పడుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో చేరారు.
అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది.