Home » Tag » NDA
తింటే పన్ను... తిరిగితే పన్ను... నిద్రపోతే పన్ను... మేల్కొంటే పన్ను.... ఇవేవో తుగ్లక్ జమానా పన్నులు కావు... మన నిర్మలమ్మ గారి పన్ను పోట్లు...,సామాన్యుడి పాట్లు... ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని కాసుకు కూర్చున్నారు మన కేంద్ర ఆర్థికమంత్రి... లేటెస్ట్గా పాప్‌కార్న్‌పై వేసిన GST శ్లాబులు మీమర్స్‌కు మంచి మసాలాను అందించాయి.
అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేయడం...మహయుతికి కలిసి వచ్చిందా ?
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), శివసేన మరియు ఎన్‌సిపి కూటమి భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై సందిగ్దత నెలకొంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డియే దూసుకుపోతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మహాయుతి హవా కొనసాగుతోంది. 220 స్థానాల్లో మహాయుతి కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్ర లో సొంతగా 128 స్థానాల్లో బిజెపి ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణ విషయంలో గతంలో చంద్రబాబు సర్కార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సిబిఐ విచారణ పేరుతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపిస్తూ... సిబిఐ కొత్త కేసులు టేకప్ చేయకుండా అడ్డుకట్ట వేసారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్ట్స్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా ... ఇండియా కూటమితో జత కలుస్తారా... అన్నది సస్పెన్స్ గా మారింది.
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో NDA ప్రభుత్వం కొనసాగుతోంది అంటే... అది టీడీపీ, జేడీయూ చలవే. ఈ రెండు పార్టీలు లేకపోతే మూడోసారి నరేంద్రమోడీ అధికారం చేపట్టడం కష్టమయ్యేది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో... ఈ రెండు పార్టీలకు చెరో రెండు పదవులు ఇచ్చారు మోడీ. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై రెండు పార్టీలు పట్టుబడుతున్నాయని వార్తలు వచ్చినా... అవేమీ నిజం కాదని తేలిపోయింది.
కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వాళ్లకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తెలంగాణ కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) కు చోటు లభించింది. వీరిద్దరికీ పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించలేకపోకపోయిన బీజేపీకి ఇప్పుడు మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి అయింది. ఇందులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా మారాయి. బాబుకి 16 ఎంపీ సీట్లు ఉంటే, నితీష్ కి 12 మంది ఉన్నారు.