Home » Tag » Neelam Madhu
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళయిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో.. ఈ ప్రచారం మరింత జోరందుకుంది. మంత్రివర్గ విస్తరణకు.. కాంగ్రెస్ పెద్దల అనుమతి
పటాన్ చెరు నుంచి ఎట్టి పరిస్థితుల్లో MLAగా కంటెస్ట్ చేయాలనుకున్న మధు.. చివరకు BSP బీఫామ్ ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. గత వారం, పది రోజులుగా పటాన్ చెరు రాజకీయం అంతా నీలం మధు ముదిరాజ్ చుట్టూనే తిరిగాయి.
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక మరో పార్టీ పార్టీ అయిన బీఎస్పీ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 99 అభ్యర్ధులను ప్రకటించింది. కాగా ఇవాళ మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ పొంది.. చివరి క్షణంలో టికెట్ కోల్పొయిన పటాన్ చెరు అభ్యర్థి నీలం మధు.. బీఎస్పీ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర ఉప అధ్యక్షుడు దయానంద్ చేతుల మీదుగా.. బీ ఫార్మ అందుకున్న నీలం మధు ముదిరాజ్.
పఠాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ముందు నుంచీ అక్కడ టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఆయన అనుచరులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడించారు.
పఠాన్‌చెరు (Patan Cheru ) నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మంటపెట్టింది. ఇక్కడి నుంచి నీలం మధు (Neelam Madhu) ముదిరాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా భగ్గుమన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ (Notification) వచ్చినప్పటి నుంచి.. పటాన్చెరు నియోజకవర్గంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కేటీఆర్ (KTR) కు సన్నిహితుడిగా పేరు ఉన్న నీలం మధు.. బీఆర్ఎస్ తరఫున ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. ఐతే నిరాశే ఎదురైంది.
కాంగ్రెస్ మూడో జాబితా (Congress Third List) విడుదలైంది. ఈ జాబితాతో కాంగ్రెస్ లో మంటలు రాజుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి.. రెండు సీట్లు అయితే పెద్దగా.. చర్చ లోకి రాదు కానీ దాదాపు 9 నియోజకవర్గాలు వనపర్తి, నారాయణఖేడ్, పటాన్ చెరు, చెన్నూరు, డోర్నకల్, పాలకుర్తి, తుంగతుర్తి, సంగారెడ్డి, బోథ్ లో కాంగ్రెస్ పాత అభ్యర్థులు ఆందోళనలు చేపడుతున్నారు.
పటాన్చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకు.. బీఆర్ఎస్ నుంటి టికెట్ దక్కలేదు. దీంతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు మధు. అప్పటి నుంచి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడ్డాయ్. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీతో సహా అన్ని పార్టీలు టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయ్.
తెలంగాణ రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్లకు నీలం మధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో స్టార్‌గా ఉన్న నీలం మధు.. చాలామందికి చేరువయ్యారు కూడా. పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కారు పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని డిసైడ్అ య్యారు.