Home » Tag » Netherlands
నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస విజయాలతో భారత జట్టు అందరికంటే ముందుగా సెమీస్ చేరింది. అందువల్ల నెదర్లాండ్స్‌తో మ్యాచును తేలికగా తీసుకుంది. దీంతో, టీమిండియా మేనేజ్మెంట్ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్‌లో ఘోర పరాజయం.. అలాగే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు రెండింటిలోనూ 300కు పైగా పరుగులు చేసినా పరాజయం కావడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మెగా టోర్నీ క్రికెట్ ఆరంభంలో పాక్ క్రికెట్ జట్టు ఆటతీరు చాలా మందిని విస్మయ పరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. వీటన్నింటి మధ్య పాక్ జట్టు ఇప్పుడు కొత్త వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఇన్నింగ్స్ 39వ ఓవర్లో డచ్ పేసర్ వాన్ మీకెరెన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్‌లను గిరాటేసింది. బంతి కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్‌లను తాకింది. ఇది చూసిన మీకెరెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
నెదర్లాండ్స్ జట్టు కూడా బెంగళూరులో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. నెట్ బౌలింగ్ చేసేందుకు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఎంపిక కావడమే విశేషం. 2023 వన్డే ప్రపంచ కప్‌లో అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్న సమయంలో నెదర్లాండ్స్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
రోహిత్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
సాధారణంగా ఒకదేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇందులో మసాలా దినుసులు మొదలు మోటారు వాహనాల వరకూ అన్నింటినీ తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో సారి సరకు నష్టం, ప్రాణనష్టం సంభవిస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన అట్లాంటిక్ సముద్రంలో చోటు చేసుకుంది.
ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు ఉన్న కాలానికి ప్రస్తుతం ఉన్న కాలానికీ పొంతన లేనంతగా మారిపోయింది. అబ్బాయిలు ఫ్యాషన్ షో పోటీల్లో పాల్గొనడం చూశాం. అమ్మాయిలు విశ్వసుందరిగా నెగ్గడం చూశాం. కానీ ఇక్కడ ఇరువురి కలయికతో కూడిన అర్థనారీశ్వరుడికి అంటే ఒక ట్రాన్స్ జండర్ అందాల పోటీల్లో పాల్గొన్నారు. అందాల కిరీటాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇది చరిత్రలోనే మొట్టమొదటి సారిగా చెప్పాలి. ఈ పోటీలు ఎక్కడ జరిగాయో ఈ టైటిల్ గెలుచుకున్న ట్రాన్స్ జెండర్ పేరు తదితర పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 4 మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక జట్టు భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. దీంతో పాటు ఈసారి పోటీ చేయనున్న 10 జట్లలో 9 జట్లు ఫైనల్‌కు చేరాయి. అయితే 10వ జట్టు ఇంకా ఖరారు కాలేదు.
ఏపీలోని విజయవాడలో పుట్టాడు తేజ నిడమానూరు. చిన్నతనంలోనే అతడి కుటుంబం విజయవాడ నుంచి న్యూజిలాండ్ వెళ్లిపోవడంతో.. అక్కడ ఆక్లాండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకుని.. డొమెస్టిక్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ వెంటనే తేజకు నెదర్లాండ్స్‌లో ఉద్యోగం రావడంతో భారత్.. వయా న్యూజిలాండ్.. టూ నెదర్లాండ్స్ చేరుకున్నాడు.
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్ జట్టుకు కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జింబాబ్వే చేతిలో ఘోర ఓటమిని చవి చూసిన ఆ జట్టు.. తాజాగా నెదర్లాండ్స్ చేతిలో కూడా పరాజయం పాలైంది.