Home » Tag » New Model
ఐఫోన్ 15 తోపాటూ యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈవెంట్ వేదికగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఉత్పత్తులు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ఇది యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ప్రత్యేకంగా నిలిచింది. 2030 నాటికి తమ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు పర్యావరణహితంగానే ఉంటాయని తెలిపారు. అలాగే ఈ ఐఫోన్స్ కి తొలిసారిగా టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ తో తీసుకురానున్నారు.
యాపిల్ కంపెనీ ఎట్టకేలకు ఐఫోన్ 15 మోడల్స్ పూర్తి వివరాలతో పాటూ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే తేదీని ప్రకటించింది. వీటి ధరను కూడా వెల్లడించింది.