Home » Tag » New Secretariat
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని, మసీదును, చర్చిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
పైకి మెరుస్తూ.. అందంగా కనిపిస్తున్న సచివాలయం.. లోపల మాత్రం అంతా డొల్లేనా అంటున్నారు విమర్శకులు. వేసవి కాలం ఒకట్రెండు రోజులు కురిసిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే.. వర్షాకాలం భారీ వానలకు సచివాలయం ఏమవుతుందో అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నిజంగా సచివాలయం పైన పటారం.. లోన లొటారమేనా?
కౌంటర్ కి కౌంటర్ అటాక్.
28 ఎకరాల స్థలం, 7 అంతస్థుల భవనం, 630 గదులు, 1200 సీసీ కెమెరాలు.. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో.. తెలంగాణ కొత్త సచివాలయం ఇవాళ కొలువుదీరింది. అనుకున్న సమయానికి రిబ్బన్ కట్ చేశారు. నిర్ణీత ముహూర్తంలో తన చైర్లో కూర్చున్నారు. పాత సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ మొత్తం ముందుగానే కొత్త సెక్రటేరియట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రైతుల గురించి కేసీఆర్ ప్రసంగం
నూతన సచివాలయ నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు ముందుకు వచ్చారు.
ఇంద్రభవనాన్ని మించిన శోభ తెలంగాణ సచివాలయం సొంతం
సరికొత్త హంగులతో నిర్మించిన నూతన తెలంగాణ సచివాలయ భవనం.
తెలంగాణ నూతన సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని హంగులతో ఇది తయారైంది. అన్ని విభాగాలు ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది.
అత్యంత సుందరంగ, సరికొత్త హంగులతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. సువిశాలమైన ప్రాంగణం.. ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసి చుట్టూ పచ్చని చెట్లను పెంచి అహ్లాదకరంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక భవనం లోపల ప్రతి మూల ఒక అద్భుతమైన పనితీరును కనబరిచారు. ఫ్లోరింగ్ మొదలు కూర్చునే చైర్ వరకూ.. సచివాలయ ఉద్యోగులు పనిచేసే డెస్క్ మొదలు వీఐపీలు భోజనం చేసే డైనింగ్ హాల్ వరకూ ప్రతి ఒక్కటి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆరవ అంతస్తులోని సీఎం క్యాబిన్ మరింత హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.