Home » Tag » new trends
సినిమా అంటే థియేటర్లోనే చూడాలి. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఆ అరుపులు, విజిల్స్ మధ్య హీరోల ఎలివేషన్ సీన్స్ డబుల్ డోస్‌తో ఎలివేట్ అవుతాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు ఇదో ట్రీట్ లాంటిది. ఒకప్పుడు సినిమాలు అంటే ఫస్ట్ డే థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం ఉండేది. థియేటర్ బిల్డింగ్‌కు తోరణాలు కట్టి బాంబులు పేలుస్తూ జాతర చేసినట్టు చేసేవాళ్లు ఫ్యాన్స్.
సినిమా అంటూనే మనకు గుర్తుకొచ్చే భావన వినోదం. వారం మొత్తం పనిచేసి చికాకుగా అనిపిస్తే ఈ వారంలో ఏఏ సినిమాలు కొత్తగా విడుదలయ్యాయి అని స్నేహితులను అడిగి తెలుసుకుంటాం. టైటిల్ ఆసక్తిగా అనిపిస్తే హాలుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తాం. అలాగే ఏదైనా విషయాన్ని అతిత్వరగా ప్రజల్లోకి దూసుకుపోవడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన మాధ్యమం సినిమా. దీని స్థాయి పెరిగే కొద్దీ కాలవ్యవధి తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు రెండు సంవత్సరాలు నిర్విరామంగా ఆడే చిత్రాలు కాస్త 356 రోజులకు కుదించబడ్డాయి. 200రోజులు ఆడే స్థాయి నుంచి 100 రోజుల్లో బొమ్మ అదుర్స్ అనిపించుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇప్పుడే అసలైన నూతన ఘట్టానికి క్లాప్ కొట్టింది సినీ కళామతల్లి. 100రోజులు ఆడే బొమ్మ క్రమక్రమంగా 50రోజులు ఆడేలా రూపుదిద్దుకుంది. ఇప్పుడైతే ఏకంగా వారం నుంచి నెల రోజులు మధ్య ఆడేలా సరికొత్త వాతావరణం థియేటర్ల వద్ద ఏర్పడింది.